దాడులకు రెక్కీ చేసింది పోలీసులేనా !?

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం రోజు అందరూ పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లు, ఆఫీసులపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడుల్లో రెక్కీ చేసింది పోలీసులేనని బలమైన ఆధారాలు సీసీటీవీ ఫుటేజీ రూపంలో.. ఇతర విధాలుగా లభించాయి. అవి సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. పట్టాభి ఇంటిపై దాడికి ఓ పోలీస్ ప్రత్యేకంగా రెక్కీ చేశారు. ఇంటికి వచ్చి వివరాలు కనుక్కుని వెళ్లి..మళ్లీ అల్లరి మూకల్ని తీసుకుని వచ్చాడు. పోలీసు బయటే ఉండి అందర్నీ దాడికి ఇంట్లోకి పంపిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరో వైపు తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేయడానికి ముందు కూడా ఓ పోలీసు అధికారి వచ్చి వివరాలు తెలుసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే సమయంలో సమాచారం ఇచ్చినా కనీస భద్రత కల్పించకపోవడం.. దాడి చేసి వెళ్లే వరకూ పోలీసులు ఎవరూ రాకపోవడం మాత్రమే కాదు.. వెళ్తున్న వారిని డీఎస్పీ సగౌరవంగా దగ్గరుండి.. కార్లలో ఎక్కించి పంపేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.

ఇక అల్లరి మూకలతో పాటు టీడీపీ ఆఫీసులోకి చొరబడిన డీజీపీ ఆఫీసులో స్పాటర్‌గా విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ సక్రూ నాయక్‌ను టీడీపీ నేతలు పట్టుకున్నారు. పోలీస్ యూనిఫార్మ్ కాదు కదా.. కనీసం ఐడీ కార్డు కూడా లేకుండా ఆయన లొపలికి చొరబడ్డారు. గదుల్లోకి వెళ్లి దారి తెలియక ఓ చోట నక్కి ఉంటే టీడీపీ నేతలు పట్టుకున్నారు. అక్కడ ఆయనేం చేస్తున్నాడో పోలీసులు చెప్పలేకపోతున్నారు. విధి నిర్వహణ అంటే దాడులు చేసే వారితోపాటు వెళ్లడమా అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఆయనను పట్టుకున్నందుకు లోకేష్‌తో పాటు పలువురిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు పోలీసుల తీరు బలం చేకూర్చేలా ఉంది. పోలీసులు అంటే రక్షకులు అని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు అల్లరి మూకలతో వారే దగ్గరుండి దాడులు చేయించారంటే.. ఇక ప్రజల్లో వారి పట్ల సానుకూల భావన ఎలా వస్తుంది. అమర వీరుల దినోత్సవం జరుపుకుంటున్న రోజులన పోలీసుల తీరుపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న పెద్దలకు ఎలా ఉందో కానీ.. నిజంగా పోలీసుల్ని హీరోలుగా చూసే వారికి మాత్రం ఆవేదన కలగడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close