చంద్రబాబు కుప్పం వస్తే బాంబులేస్తాం.. వైసీపీ నేతల హెచ్చరిక !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబును రెండు రోజులు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో అన్నితిట్లు తిడుతున్నారు. పట్టాభి సీఎంను అసభ్యంగా ఓ పదంతో తిట్టారని.. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడమే కాకుండా ఇప్పుడు వారిపై అత్యంత దారుణమైన తిట్లను ప్రయోగిస్తున్నారు. తాజాగా కుప్పం వైసీపీ నేత ఒకరు చంద్రబాబు కుప్పం వస్తే బాంబులేస్తామని ప్రకటించారు. కుప్పం రెస్కో అనే సంస్థకి నామినేటెడ్ చైర్మన్ పదవి పొందిన సెంధిల్ కుమార్.. చంద్రబాబు కుప్పం వస్తే కారుపై బాంబులేస్తానని ప్రకటించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కుప్పంలోనూ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్నారు. రెండో రోజు ఎంపీ రెడ్డప్ప కుప్పం వచ్చి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సెంధిల్ కుమార్‌కు మైక్ ఇచ్చారు. అంతే వైసీపీ అధ్యక్షుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో బాగా అధ్యయనం చేసినట్లుగా రెచ్చిపోయారు. చంద్రబాబుపై బండబూతులు తిట్టారు. కుప్పం వస్తే బాంబులేస్తామని హెచ్చరించారు. ఆయన బూతు పంచాంగాన్ని ఎంపీ రెడ్డప్ప కూడా తట్టుకోలేకపోయారు. ఆయన వద్ద నుంచి మైక్ లాక్కున్నారు.

సెంధిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. కుప్పంలో ఆందోళనలు ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి వెళ్లారు. దీంతో ఉద్రిక్తి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close