“మా” ఎన్నికలకు వైసీపీ పరిశీలకుడిగా రౌడీషీటర్ వచ్చారట !

“మా” ఎన్నికలను పర్యవేక్షించి మంచు విష్ణును గెలిపించేందుకు వైసీపీ తరపున ఎన్నికల పరిశీలకుడిగా ఓ నొటొరియస్ క్రిమినల్‌ను పంపినట్లుగా ప్రకాష్ రాజ్ కొత్తగా ఆరోపణలు చేశాయి. ఎన్నికలు జరుగుతున్నసమయంలో.. కౌంటింగ్‌లో ఫోన్‌లో మాట్లాడుతూ.. సీరియస్‌గా తిరుగుతున్న వ్యక్తి ఫోటోలు, వీడియోలతో ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. “మా”సభ్యుడు కానీ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రౌడీషీటర్ లోపలికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇది ఆరంభం మాత్రమేనని సీసీ టీవీ ఫుటేజీ ఇస్తే మొత్తం ఏం జరిగిందో ప్రజల ముందు పెడతానని ప్రకటించారు.

ప్రకాష్ రాజ్ బయట పెట్టిన ఆ రౌడీషీటర్ పేరు నూకల సాంబశివరావు. ఆయన జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ నేత. ఆయనపై హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసుతో పాటు పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అక్కడ రౌడిషీట్ కూడా ఉంది. ఆయన ఎందుకు “మా”ఎన్నికలకు వచ్చాడో ఎవరికీ తెలియదు కానీ… మంచు ఫ్యామిలీకి అవసరమైన వైసీపీ మార్క్ సహకారం అందించేందుకు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.

మంచు విష్ణు ఈ రోజు “మా”కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తానని గురువారం ప్రకటించారు. శుక్రవారం ఆ అంశాన్ని వెల్లడిస్తానన్నారు. మంచు విష్ణు ఆ ప్రకటన చేయక ముందే ప్రకాష్ రాజ్ షాకింగ్ న్యూస్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు ఈ అంశంపై మంచు విష్ణు టీం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : “ఓ వర్గం” సెలబ్రిటీలకే ప్రభుత్వ సాయమా ? మిగతా వాళ్లు, సామాన్యులు మనుషులు కారా ?

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన సినిమా పాటలతో ప్రసిద్ధి పొందారు. సినిమా సహజంగానే గ్లామర్ ఫీల్డ్.. ఆయన పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి కాబట్టి స్ఫూర్తి పొందిన వారు.. ప్రేరణ పొందిన వారు...

“సెక్రటేరియట్” ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు !?

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇప్పటి వరకూ వారికి ఎలాంటి ప్రత్యేక భత్యాలు లేకుండా కేవలం రూ. పదిహేను...

బీజేపీ నెత్తిన పాలు పోస్తున్న మమత,కేజ్రీవాల్ !

భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ విపక్షాలే. కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీలతో కలిసి మోడీని ఓడించాలి. కానీ ఆ ఇతర పార్టీల్లోని నేతలు తమను...

అఖండ‌ రివ్యూ – మాస్ జాతర

Akhanda telugu review Telugu360 Rating : 3/5 ఓ మాస్ హీరోని ఎలా చూపించాలో బోయ‌పాటి శ్రీ‌నుకి బాగా తెలుసు. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఎలా కావాలో.. ఆ లెక్క‌ల‌న్నీ బాగా బ‌ట్టీ...

HOT NEWS

[X] Close
[X] Close