విమర్శలు ప్రజాస్వామ్యసహితంగా ఉండాలి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బూతులు, నీచమైన భాషతో ట్వీట్లు పెట్టే వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విజయసాయిరెడ్డి కూడా .. రాజకీయ విమర్శలు ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన జనాగ్రహ దీక్షకు సంఘిభావం చెప్పేందుకు వచ్చిన ఆయన విమర్శలు ప్రజాస్వామ్య సహితంగా ఉండాలని.. అసహ్యకరమైన భాష వాడకూడదని సూక్తులు చెప్పారు. టీడీపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను అసభ్యకరంగా దూషించడం శోచనీయమని బాధపడ్డారు. లోకేష్ కూడా దారుణంగా ట్వీట్లు పెడుతున్నారని అన్నారు.

విజయసాయిరెడ్డి మాటలను వైసీపీ నేతలు కూడా ఆయన వైపు అలా చూస్తూండిపోయారు. సభ్యత, సంస్కారం లేని నాయకుడిగా ఇప్పటి వరకూఆయనకు పేరు ఉంది. ట్విట్టర్‌లో కానీ బయట కానీ ఆయన మాట్లాడే మాటలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ట్వీట్ పెట్టినా కొన్ని వందల మంది ఆయన తీరును తప్పు పడుతూ కామెంట్లు పెడుతూ ఉంటారు. చివరికి చంద్రబాబునాయుడు పుట్టిన రోజున కూడా శుభాకాంక్షల పేరుతో వ్యక్తిగత లోపాలను ఎత్తి చూపించి ట్వీట్లు పెట్టే కుసంస్కారం విజయసాయిరెడ్డి సొంతం. ఆయన కూడా ఇప్పుడు నీతులు చెప్పడానికి బయలుదేరి రావడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఏమైందో కానీ ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు తక్కువగా వస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు కానీ ఇతురలను తిట్టడం లేదు. వైసీపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందని అందుకే ఆయన ఇలా చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా కానీ.. దారుణమైనభాషకు ట్విట్టర్‌లో ఓ బ్రాండ్‌గా మారిన విజయసాయిరెడ్డి నీతులు ప్రారంభించడం మాత్రం హైలెట్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close