ఆర్యన్ కేసులో వాంఖడే హీరో కాదు విలన్ ?

షారుఖ్ ఖాన్ కుమారుడి డ్రగ్స్ కేసులో హీరోగా ప్రశంసలు పొందుతున్న సమీర్ వాంఖడేపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు క్రూయిజ్ పై దాడి చేసినప్పుడే ప్రైవేటు వ్యక్తులను తీసుకెళ్లి .. వాళ్లని సాక్షులుగా చూపించారు. ఇప్పుడు ఆ సాక్షుల్లో ఒకరు వాంఖడేపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కోర్టులోనే పిటిషన్ వేశారు. ఆయన తన వద్ద సాక్షి స్టేట్‌మెంట్ పత్రాల కోసం ఐదు బ్లాంక్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం కేసు కుట్ర పూరితమైనదని.. రూ. కోట్లలో వసూళ్లకు పాల్పడుతున్నారని సమీర్ వాంఖడే బృందం సాక్షిగా చెప్పిన ప్రభాకర్ సెయిల్ ప్రకటించారు.

ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొంత మంది ఆయనతో సెల్ఫీలు దిగారు. వీడియోల్లోనూ మరికొంత మంది కనిపించారు. అసలు వీరెవరు అన్నదానిపై సోషల్ మీడియా ఆరా తీసింది. చివరికి వారిలో ఒకరు బీజేపీ నేత కాగా.. మరొకరు ఇండిపెండెంట్ డిటెక్టివ్‌గా ప్రచారం చేసుకునే మరో వ్యక్తి ఉన్నట్లుగా తేలింది. అసలు ఎన్‌సీబీ ఆపరేషన్‌లోకి వాళ్లెందుకు వచ్చారన్న దుమారం రేగడంతో వారు సాక్షులని ఎన్‌సీబీ అధికారులు చెప్పడం ప్రారంభించారు. వీరిలో ప్రైవేటు డిటెక్టివ్ గోసవి అనే వ్యక్తి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ద్వారానే వాంఖడే డబ్బుల డీల్స్ చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

షారుఖ్ ఖాన్ కుమారుడిగా సెలబ్రిటీగా ఆర్యన్‌కు వస్తున్న పబ్లిసిటీనో .. లేక మరో కారణమో కానీ విచిత్రంగా మూడు సార్లు బెయిల్ కూడా తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితి గతంలో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన వారికి లేదు. కానీ ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను బయటకు తీసి.. దాంట్లో ఉన్న వారందర్నీ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఆయన గురించి మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇస్తున్నారు. అలా చెప్పారని.. ఇలా చేశారని అందులో ఉంటోంది. ఈ పరిణామాలతో సమీర్ వాంఖడే నిజాయితీపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొసమెరుపేమిటంటే వాంఖడే భార్య ఓ నటి.. ఆమె ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాంలోనూ ఆమె పేరు వినిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close