7 అంశాలను తక్షణం పరిష్కరించండి : జగన్

తిరుపతిలో జరిగిన దక్షిణ భారత కౌన్సిల్ సమావేశాల్లో సీఎం జగన్ ఏపీ తరపున ఏడు ప్రధానమైన అంశాలను లేవనెత్తారు. విభజన కారణంగా ఏపీ తీవ్రంగానష్టపోయిందని.. ఈ సందర్భంగా ఇచ్చిన హమీలేవీ అమలు కాలేదన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి 2013 -14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోందని.. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్రం విధానాల వల్ల ఏపీ జీవనాడి అయిన పోలవరం భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి నిధులను భరించాలని కోరారు.

విభజన జరిగిన ఏడాది ఆర్థిక లోటును భర్తీ చేస్తామని చెప్పారని కానీ చేయలేదన్నారు. కేవలం రూ. నాలుగు వే కోట్లు ఇచ్చారని.. కానీ రూ. ఇరవై వేల కోట్లకుపైగాలోటు ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా సాయం చేయాలని కోకారు. ఇక తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వాటిని ఇప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసింది కాబట్టి కేంద్రమే ఇప్పించాలని సీఎం జగన్ కోరారు.

నాలుగో అంశంపై ప్రత్యేకహోదా కోరారు. ప్రత్యేకహోదా హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగిందని అయినా అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదని జగన్ గుర్తు చేశారు. అలాగే బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇక షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ జరగాల్సి ఉందన్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా పేర్కొన్నారు.

అంతర్‌రాష్ట్ర, కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీరు సరఫరా చేస్తూనే ఉంది. ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉందన్నా ఇవ్వడం లేదన్నారు. వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలని కోరారు. అలాగే కుప్పంలో పాలారు ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం అడ్డు పడుతోందని.. దీనిపై కూడా అనమతులు వచ్చేలా చూడాలన్నారు.

ఆరో అంశంగా రుణ పరిమితిని పెంచాలని జగన్ కోరారు. గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారని ఇప్పుడు కోత విధించారని.. తగ్గించిన మేరకు ఇప్పుడు అప్పులకు పరిమితి పెంచాలని కోరారు. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయని సరి చేయాలని కోరారు. ఏపీకి తక్కువగా సరుకులు వస్తున్నాయన్నారు.

ఈ సమావేశానికి ఏపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రమే హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close