హ‌రీష్ శంక‌ర్ సినిమాలో హీరో మారాడా?

ఈమ‌ధ్య టాప్ ద‌ర్శ‌కులు… త‌మ శిష్యుల సినిమాల‌కు క‌థ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ లో తెర‌కెక్కే చిన్న సినిమాల‌న్నింటికీ సుకుమారే క‌థ‌కుడు. అలానే హ‌రీష్ శంక‌ర్ సైతం ఓ క‌థ‌ని త‌న శిష్యుడికి ఇచ్చాడు. ఆక‌థే `వేదాంతం రాఘ‌వ‌య్య‌`. సునీల్ క‌థానాయ‌కుడిగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల్సింది. చాలా రోజుల క్రిత‌మే ఈ ప్రాజెక్టుని ప్ర‌క‌టించారు అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈలోగా ఈ సినిమా స‌మీక‌ర‌ణాలు చాలా మారాయ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అనిల్ సుంక‌ర ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నార‌ని, ఈ సినిమా నిర్మాత‌లు మార‌బోతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు సునీల్ ప్లేసులో మ‌రో హీరో వ‌స్తున్నాడ‌ట‌. సునీల్ కి రీప్లేస్‌మెంట్ గా స‌త్య‌దేవ్ పేరు ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా నుంచి సునీల్ ఎందుకు త‌ప్పుకోవాల‌ని అనుకుంటున్నాడో తెలీలేదు. హ‌రీష్ ఈ స్క్రిప్టుని ఎప్పుడో పూర్తి చేశాడు. త‌ను ప్ర‌స్తుతం త‌న దృష్టినంతా.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాపైనే పెట్టాడు. ప‌వ‌న్ – హ‌రీష్ కాంబినేష‌న్‌లో `భ‌త‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` అనే చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. హ‌రీష్ ఈ సినిమాపై క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. మ‌రి… వేదాంతం రాఘ‌వ‌య్య ఎప్పుడు మొద‌ల‌వుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close