చైతన్య : ప్రభుత్వాలు సినీ పరిశ్రమలకు అవార్డులు ఎందుకివ్వాలి !?

మెగాస్టార్ చిరంజీవి ఓ వేడుకలో మాట్లాడుతూ ప్రభుత్వాలు సినీ పరిశ్రమలకు చెందిన కళాకారులకు అవార్డులు ఇవ్వడం మరిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గుర్తించి అవార్డులు ఇవ్వాలని కోరారు. చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా మందికి నంది అవార్డులు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు నంది అవార్డులు ఇచ్చేవి. ప్రతీ ఏడాది ఠంచన్‌గా ఇవ్వకపోయినా గుర్తొచ్చినప్పుడో.. నిధులు ఉన్నప్పుడో రెండు, మూడేళ్లకు ఓ సారి ఇచ్చేవి. ఇటీవలి కాలంలో ఆ అవార్డులు ఇవ్వడం లేదు. అందుకే మెగాస్టార్ ఆ అవార్డులను రెండు ప్రభుత్వాలకు గుర్తు చేసినట్లయింది.

అవార్డులిచ్చిన ఏపీ ప్రభుత్వంపై కుల ముద్ర వేసింది గుర్తు లేదా !?

చిరంజీవి ఆవేదన ఎలా ఉన్నా… ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని గుర్తించలేదని… అవార్డులు ఇవ్వడం లేదనడం సరి కాదు. ఎందుకంటే అలా చేసుకుంది టాలీవుడే. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. తెలంగాణ ప్రభుత్వం సింహా అవార్డులు ఇస్తామని చెప్పింది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖులతోనే జ్యూరీని నియమించింది. ఆర్థిక కష్టాలున్నా… ఖర్చు అనుకోకుండా 2014, 2015, 2016 సంవత్సరాలకు జ్యూరీలను నియమించింది. వారు పురస్కారాలను ఎంపిక చేసి 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించింది. కానీ అప్పుడేం జరిగింది. అవార్డులకు కుల ముద్ర వేశారు. ప్రభుత్వాన్ని రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కులాల్ని తెరపైకి తెచ్చారు. చివరికి ఏపీ ప్రభుత్వం ఈ “దరిద్రం” మాకెందుకు అనుకునే పరిస్థితికి తెచ్చారు. అవార్డుల్ని ప్రకటించి వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీని గౌరవిద్దామనుకుంటే ఎదురుగా తమపైనే కుల ముద్ర వేసిన ఇండస్ట్రీ ముఖ్యులను మళ్లీ ఏ ప్రభుత్వమైనా గౌరవిస్తుందా ?

గౌరవించాలనుకున్న వారిని అవమానించిన టాలీవుడ్‌ను ఎవరైనా దగ్గరకు తీస్తారా ?

అవార్డులు ఇచ్చి సత్కరించాలనుకున్న ప్రభుత్వంపై రివర్స్‌లో కుల ముద్ర వేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగా మెగా క్యాంప్‌కు చెందిన వారే. బన్నీ వాసు అనే నిర్మాత.. టాలీవుడ్‌లో మెగా క్యాంప్ కలెక్షన్లు యాభై శాతానికిపైగా ఉంటాయని… తమకు గొప్ప అవార్డులు ఇవ్వకపోవడమేమిటి.. ఇదంతా కుల వివక్ష అని రచ్చ చేశారు. నిజానికి అవార్డులు ఎంపిక చేసింది కూడాటాలీవుడ్ వాళ్లే. ప్రభుత్వానికేం సంబంధం లేదు కానీ చేయాల్సిన రచ్చ చేసి.. రాజకీయంగా ప్రభుత్వపై కుల ముద్ర వేయాలనుకున్నారు. వేశారు. కానీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నామని గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అవార్డులు ఎందుకు ఇవ్వాలి అని ప్రభుత్వాలు అనుకునే పరిస్థితి వచ్చింది.

ఏ ప్రభుత్వమైనా టాలీవుడ్‌కు అవార్డులిచ్చి లేనిపోని వివాదాలను తెచ్చుకుంటుందా?

ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన తరవాత సహజంగానే తెలంగాణ సర్కార్ పైనా ఒత్తిడి పెరిగేది. అప్పట్లోనే తెలంగాణ సర్కార్ కూడా సింహా అవార్డులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుందన్న ప్రచారం జరిగింది. కానీ ఏపీలో జరిగిన నంది అవార్డుల రచ్చ చూసిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా ప్రయత్నం మానుకుంది. ఆ తర్వాత ఇక ఎలాంటి అవార్డుల ఆలోచనలు చేయడం లేదు. ఇక చేయవు కూడా. ఇదంతా టాలీవుడ్ చేసుకున్న స్వయంకృతం. టాలీవుడ్‌ను గౌరవించాలనుకున్న వారిని అవమానించిన ఫలితం. ఇది టాలీవుడ్‌ను ఎప్పటికీ వెంటాడుతుంది. ఏ ప్రభుత్వమూ మంచి చేయాలనుకుని .. చెడు అవ్వాలనుకోదు.

అప్పట్లోనే చిరంజీవి స్పందించి ఉంటే బాగుండేది !

మెగాస్టార్ చిరంజీవి అప్పట్లోనే ఏపీ ప్రభుత్వపై తమ క్యాంప్‌గా చెప్పుకుంటూ కొంత మంది చేసిన కుల పరమైన విమర్శల్ని ఖండించాల్సింది. అడ్డుకోవాల్సింది. ఇండస్ట్రీని గౌరవించి ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్ని గౌరవించాల్సింది. కానీ చిరంజీవి అప్పులు అలాంటివేమీ చేయలేదు. ఇప్పుడు అవార్డులు ఇవ్వలేదని బాధపడుతున్నారు. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close