చైతన్య : థూ..! ఏపీకి ఈ గతి పట్టిందేంటి !?

ఆంధ్రప్రదేశ్ అంటే తెలివిగలవాళ్లు ఉండే రాష్ట్రం అని అనుకునేవారు. దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఆంధ్ర వాళ్లు ఉన్నారని లెక్కలు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు నిన్నగాక మొన్న విడిపోయిన తెలంగాణ వాళ్లు కూడా ఏపీని చూసి జాలి పడుతున్నారు. విడిపోయి మంచిదయిందని సంతోషపడుతున్నారు. ఇలాంటి పాలకులు ఉమ్మడి ఏపీలో వచ్చి ఉంటే తెలంగాణకు కూడా ఆ ” సిగ్గు.., లజ్జ” లేని రాష్ట్రం ఇమేజ్ వచ్చి ఉండేదని సోషల్ మీడియాలో హమ్మయ్య అనుకుంటారు.

ఆంధ్ర అనే పదానికి పవిత్ర అర్థాన్ని తుడిచేశారు !

రాజకీయం అంటే వ్యక్తిత్వ హననం చేయడమే అన్నట్లుగా సాగిపోతున్న రాజకీయం గత రెండున్నరేళ్లుగా ఎంతో మందిని చంపేసింది. కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునేందుకు దారుణమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎంతో మంది నేతలు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అలా తిడితేనే అక్కడి ప్రభుత్వాధినేతకు కడుపు నిండుతుంది.. తన కడుపు నింపిన వారికి ఆయన కడుపు నింపుతారు. అంతే ఇంక కావాల్సింది ఏముంది. రాజకీయ ప్రత్యర్థులపై తిట్లతో విరుచుపడటమే. అది పవన్ కల్యాణ్ అయినా…చంద్రబాబు అయినా అంతే. ఆ తిట్లు తిట్టి అక్కడి నేతలు పదవులు పొందాలని ఎలా అనుకుంటున్నారో కానీ.. అలాంటి మాటలు ఎదుటి వ్యక్తులకు కూడా వస్తాయని వారు కూడా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నారు.

మీ పిల్లలు మీకే పుట్టారా అని చర్చ పెట్టిన గొప్ప రాజకీయం !

నీ పిల్లలు నీకే పుట్టారా అని ఎవరినైనా అడిగితే అది ఆ మగాడ్ని తిట్టినట్లు కాదు. ఆ ఇంటి ఆడపడుచును తిట్టినట్లు. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసినట్లు. వల్లభనేని వంశీ అనే ఓ ఎమ్మెల్యే దీన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కుటుంబం అండతో టీడీపీలో టిక్కెట్ దక్కించుకుని ఆ కుటుంబంలోని ఆడ పడుచునే కించ పరిచేలా మాట్లాడారు. అక్కడ్నుంచి అసెంబ్లీకి తీసుకు వచ్చారు. అంతే రాష్ట్రం పరువు పోయింది. అసెంబ్లీలో జరిగిన జుగుప్సాకరమైన పరిణామాలు అందరూ…”ధూ” అని ఊసేలా చేస్తున్నాయి. ఇప్పుడు పోటీగా ఆ మాటలు అన్న నేతల కుటుంబసభ్యులను సోషల్ మీడియాలో పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. వాళ్ల పిల్లలు ఫోటోలు పెట్టి వాళ్లకే పుట్టారా.. అని అసభ్యంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కోసం కుటుంబాల్ని అత్యంత అసభ్యంగా సోషల్ మీడియాకు ఎక్కించుకునే దౌర్భాగ్య నేతలు అందర్నీ “థూ” అంటున్నారు. కానీ నేతలు తుడిచేసుకుంటున్నారు.

వంద శాతం ఈ తప్పు ఆంధ్రులదే..వారే అనుభవించాలి !

ఆంధ్రప్రదేశ్ ఈ దౌర్భాగ్యానికి కారణం నిస్సందేహంగా ప్రజలే. అద్భుతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని ఎంతో మంది విశ్లేషణ చేశారు. కష్టపడే ప్రజలు ఆలోచన ఉన్న నాయకులు అని నిన్నామొన్నటి దాకా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఏపీ ఉన్న దుస్థితికి కారణం వంద శాతం ప్రజలే. చేసిన తప్పేంటో.. చేయకూడదని తప్పేంటో ఇప్పటికీ వారు తెలుసుకోలేకపోతున్నారు. వారు రెండు వైపులా చీలిపోయి.. తాము ఎంత మురికి గుంటలో ఉన్నామో తెలుసుకోలేకపోతున్నారు. ఏపీ ప్రజల వినాశనాన్ని కోరుకుంటున్న వారు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు. అందుకే ఎవరూ ఎవర్నీ నాశనం చేయరు.. చేయలేరు.. ఎవరికి వారు నాశనం చేసుకోవాల్సిందే. ఏపీది ఇప్పుడు అదే పరిస్థితి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close