కోటి బడ్జెట్ సినిమాకు క్రేజ్ బాగానే ఉంది

ఓ సినిమా ప్రేక్షకుల్లో తీసుకెళ్లే మార్గాలు రెండే రెండు.. ఒకటి క్షణం తీరికలేకుండా సినిమాను ప్రచారం చేయడం.. లేదా వదిలిన టీజర్స్, ట్రైలర్స్ తో ప్రేక్షకులను క్షణం కూడా మిస్ అవ్వనివ్వకపోవడం. ఈ రెండిటిలో వచ్చిన ‘క్షణం’ అనేదే సినిమా టైటిల్ గా పెట్టి సినిమాను వదులుతున్నారు. అయితే పైన చెప్పిన రెండు సూత్రాలు పాటిస్తూ ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది. నూతన దర్శకుడు రవికాంత్ దర్శకత్వంలో వస్తున్న క్షణం సినిమా మొత్తం కోటి లోపే మడతెట్టేశారట.

ఓ చిన్న పాప కిడ్నాప్ మిస్టరీతో తెరకెక్కిన ఈ సినిమా ముందు మార్చ్ 4న రిలీజ్ అనుకున్నా సినిమా మీద ఉన్న నమ్మకంతో ఈ నెల 26న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కోటి బడ్జెట్ సినిమాకు ఇంత భారీ క్రేజ్ రావడానికి కారణం ‘క్షణం’ సినిమా భారీ సినిమాలను నిర్మిస్తున్న పివిపి బ్యానర్ లో నిర్మించబడటమే. పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో అడివి శేష్, అదా శర్మ లీడ్ రోల్స్ చేస్తుండగా.. అనసూయ ప్రత్యేక పాత్రలో కనబడుతుంది.

అయితే ప్రస్తుతం ట్రెండింగ్ మీదున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఓవర్సీస్ లో కూడా మంచి ఉత్సాహం కనబడుతుంది. ఇక ఈ సినిమాకు పనిచేసిన కెమెరామెన్ షానియోల్ డియో.. హాలీవుడ్ సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశాడట. క్షణం కథ నచ్చి ఈ సినిమాకు కావాలని పనిచేశాడట కెమెరామెన్. అయితే సినిమా బడ్జెట్ కోటి మాత్రమే అయినా సినిమా ప్రమోషన్ కు అర కోటి దాకా ఖర్చుచేస్తున్నారని తెలుస్తుంది. మరి ఫిబ్రవరి 26న వస్తున్న ఈ క్షణం సినిమా అయినా పివిపి బ్యానర్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close