ఆన్‌లైన్ ఓకే ! టిక్కెట్ రేట్లు పెంచండి ప్లీజ్ : చిరంజీవి

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం విషయంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి స్పందించారు. ఆయన ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మడాన్ని సమర్థించారు. దాన్ని తామే అడిగామని కూడా తన ట్వీట్‌లో వివరించారు. అయితే ఆయన తమ కోరికను బతిమాలుకున్నట్లుగానే వెల్లడించారు. అదే సినిమా టిక్కెట్ల రేట్లు. తగ్గించిన సినిమా టిక్కెట్లను కాలానుగుణంగా పెంచాలని కోరారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు.. టిక్కెట్ ధరలు కూడా అదే విధంగా ఉండటం సమంజసమన్నారు.

వివిధ రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఏపీలో కూడా అంతే నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమంజసమన్నారు. ఈ విషయం దయచేసి పునరాలోచించాలని .. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటందని చిరంజీవి విజ్ఞాపనా పూర్వకంగా తన ట్వీట్‌లో వివరించారు. ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్లను పూర్తిగా పన్నులు ఎగ్గొడుతున్నారన్న కోణంలో ప్రజెంట్ చేస్తూండటంతో … అది వద్దని చెప్పే సాహసం టాలీవుడ్ చేయలేకపోతోంది.

ఇప్పుడు అసలు సమస్య టిక్కెట్ రేట్లే. ఆ టిక్కెట్ రేట్లను కూడా పెంచబోమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే జీవో విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం టిక్కెట్ రేట్లు అమ్మితే ధియేటర్ నిర్వహణ చార్జీలు కూడా రావని భావిస్తున్నారు. ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలుజరిపినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నాగార్జున కూడా ఓ సారి వెళ్లి కలిసి వచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు చిరంజీవి విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close