రాజధాని వివాదం కోర్టుల్లోనే ఉండేలా ఏపీ సర్కార్ స్కెచ్ !

అమరావతి ఇష్యూ ఎటూ తేలకుండా కోర్టులోనే మగ్గిపోవాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బిల్లులు రద్దు చేశామని శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసిన ప్రభుత్వం.. శనివారం హఠాత్తుగా అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో సంబంధం లేని విషయాలను జోడించింది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. చెబుతూ.. శ్రీభాగ్ ఒప్పందాలను అందులో చేర్చారు. ఇది న్యాయనిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.

హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తాము రాజధాని ఎక్కడ ఉండాలో విచారించడం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు చట్టబద్దమా కాదా అన్నది మాత్రమే తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ బిల్లులు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు చెబితే సరిపోయేది. అలా చెప్పింది కూడా. కానీ ఒక్క రోజుకే అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయడం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అఫిడవిట్ దాఖలకు హైకోర్టు ఇచ్చిన గడువు 26వ తేదీ వరకే. గడువులోపు అసలు అఫిడవిట్లు దాఖలు చేసి 27నొ కొసరు అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం.

బిల్లులోని అంశాలు.. మూడు రాజధానులు కాబట్టి .. అది తమ హక్కులకు భంగం కలిగిస్తోదని రైతులు ఆరోపిస్తూ కోర్టుకెళ్లారు. అదే మూడు రాజధానులు చేసి తీరుతామని హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం కుట్ర పూరితమని అనుమానిస్తున్నారు. ఏ కారణంతో అయినా కోర్టు విచారణను ముగిస్తే.. మూడు రాజధానులకు హైకోర్టు అంగీకరించిందని చెప్పుకోడానికి.. లేకపోతే ఈ వివాదాన్ని అలాగే కొనసాగించడానికి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.

అఫిడవిట్‌లో శ్రీభాగ్ ఒప్పందాన్ని చేర్చడం న్యాయనిపుణుల్ని మరింత ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే శ్రీభాగ్ అనేది తెలంగాణను కలుపుతున్నప్పుడు పెట్టుకున్న పెద్ద మనుషుల ఒప్పందం. అసలు ఇప్పుడు ఏపీ ఒక్క దానికే ఆ ఒప్పందాల ప్రస్తావన తేవడం కుట్ర పూరితమేనని అంటున్నారు. సోమవారం నుంచి వీటిపై హైకోర్టులో విచారణ జరగనున్నాయి. పరిస్థితి చూస్తే ఈ వివాదం హైకోర్టులో ఇప్పుడల్లా తేలే పరిస్థితి లేదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close