బాల‌య్య‌, బోయ‌పాటి ఇద్ద‌రూ త‌మ సీక్రెట్స్ చెప్పాలి: రాజ‌మౌళి

అఖండ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌… శిల్ప క‌ళావేదిక‌లో వైభ‌వంగా జ‌రిగింది. చాలా రోజుల త‌ర‌వాత‌… ఆడిటోరియం మొత్తం అరుపులు, కేక‌ల‌తో మార్మోగిపోయింది. ఈ వేడుక‌కు.. రాజ‌మౌళి, అల్లు అర్జున్‌లు అతిథులుగా వ‌చ్చారు. అంద‌రి ఫ్యాన్స్ లానే…. పాట‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఎన‌ర్జీ చూసి.. రాజ‌మౌళి కూడా హుషారు తెచ్చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ..

”సినిమా ఇండ్ర‌స్ట్రీకి ఈ సినిమాతో ఊపు తీసుకొస్తున్న బోయ‌పాటికి థ్యాంక్యూ. డిసెంబ‌రు 2 మొద‌లుకుని..అన్ని థియేట‌ర్లూ… ఇలానే కేరింత‌లు కొడ‌తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. బాల‌య్య ఓ ఆటం బాంబ్‌. దాన్ని ఎలా ప్ర‌యోగించాలో బోయ‌పాటికే తెలుసు. ఆ సీక్రెట్ ఆయ‌న‌లో దాచుకోకుండా మ‌నంద‌రికీ చెప్పాలి. బాల‌య్యా.. ఆ డాన్సులేంటి? ఆ ఎన‌ర్జీ ఏంట‌సలు? మీరు కూడా ఆ ఎన‌ర్జీ సీక్రెట్ ని మాకు చెప్పాలి. పాట‌ల్లో చూపించింది కేవ‌లం మ‌చ్చుక్కి మాత్ర‌మే అని తెలుసు. సినిమా నిండా ఇలాంటివి బోలెడ‌న్ని ఉంటాయి. బాల‌య్య‌ని అఖండ గెట‌ప్ లో చూడాల‌ని నేను కూడా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా. ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ షో.. థియేట‌ర్లో ఈ సినిమాని చూస్తా” అన్నారు రాజ‌మౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close