టీడీపీలో కోవర్టులు బహిరంగం ! చంద్రబాబు చర్యలెప్పుడు తీసుకుంటారు ?

పార్టీలో కోవర్టులున్నారని వారిని ఏరివేసి ప్రక్షాళన ప్రారంభిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పం నుంచే ఆ పని చేస్తానన్నారు. కుప్పంపై రివ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పని చేసేవారు ఎవరో.. ఇతర పార్టీలు కుమ్మక్కయిన వారు ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో పని చేసే వారికీ స్పష్టత ఉంది. రాష్ట్ర స్థాయిలో పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లాగా ఉంటూ.. అటు అధికార పార్టీకి కోవర్టులుగా పని చేస్తూ ఉంటారనేది అందరికీ తెలుసు. సీనియర్లు అనే కారణంగానో.. మరో మొహమాటంతోనే వారిని దూరం పెట్టలేకపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి.. అలాంటి కోవర్టులందర్నీ బయటకు పంపేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ అది సాధ్యమా అని టీడీపీ నేతలే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటి వరకూ కఠినంగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. గతంలో సిన్సియర్‌గా పని చేశారు కదా అన్న సానుభూతితో ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తున్న వారినీ ఊపేక్షిస్తున్నారన్న భావన ఎక్కువ మందిలో ఉంది. ప్రజల్లో పట్టుకోల్పోయిన వారినీ అందలమెక్కించి..ఇప్పటికీ అనేక చోట్ల శల్యసారధ్యం అందించడానికి చంద్రబాబే పరోక్ష కారణం అన్న అభిప్రాయాలూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల వైసీపీతో కుమ్మక్కయి.. ఓ పది..ఇరవై కొర్పొరేటర్ లేదా కౌన్సిలర్ సీట్ల కోసం మొత్తం బలహీన అభ్యర్థుల్ని రంగంలోకి దించిన విషయం అందరికీ తెలుసు.

నెల్లూరులో అలాంటి ప్రయోగం చేసి..చివరికి ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేకుండా పోగొట్టుకున్నారు. కుప్పంలో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీతో కుమ్మక్కయ్యారు..భయంతోనో.. డబ్బు కోసమో ఆ పని చేశారు. ఎవరెవరు అలా చేశారో.. టీడీపీ దగ్గర రికార్డులు ఉన్నాయి. కానీ చంద్రబాబు చర్యలు తీసుకోలేరు. చంద్రబాబు మాటల్లో చెప్పిన ప్రక్షాళన నిజంగా ప్రారంభిస్తే.. పార్టీకి మంచి రోజులు వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close