సింగరేణిపైనా కేంద్రంతో కేసీఆర్ ఢీ !

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సింగరేణి విషయంలోనూ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అన్ని అమ్మేస్తున్నట్లుగానే సింగరేణిని కూడా కొద్ది కొద్దిగా కేంద్రం అమ్ముతోంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలం వేయాలని నిర్ణయించింది . దీనికి సంబంధించి సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇది సింగరేణి కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారంతా సమ్మె బాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో సమ్మె చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు కేసీఆర్.. ఆ బొగ్గు వేలాన్ని ఆపాలని కోరుతున్నారు.

ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశిన కేసీఆర్.. ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని అలాంటి బొగ్గు గనులను అమ్మేయవద్దని కోరారు. తెలంగాణలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని .,. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడుతుందన్నారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్‌ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు కోల్‌ బ్లాక్స్‌ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ లేఖ ఇప్పటికే ఆలస్యమయిందన్న అభిప్రాయం సింగరేణి కార్మికుల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close