పాదయాత్ర ఆపేసి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్న షర్మిల !

పాదయాత్రతో అనుకున్నంత మైలేజీ రావట్లేదని అనుకున్నారమో కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఊరేగింపుగా వెళ్లి .. ఓదార్పు యాత్ర చేసి జగన్ చరిత్ర సృష్టించారు . ఇప్పుడు అలాంటి అవకాశమే మళ్లీ షర్మిల సృష్టించుకున్నారు. అయితే గతంలో జగన్ తన తండ్రి కోసం మరణించిన వారంటూ సిద్దం చేసుకున్న జాబితా ప్రకారం వెళ్లారు. కానీ షర్మిల మరీ ఆనాటి జాబితా అయితే వర్కవుట్ కాదని ‌అనుకున్నారు. అందుకే లెటెస్ట్ గా ఆమె రైతు ఆత్మహత్యల జాబితాను తీసుకున్నారు.

గత 70 రోజుల్లో 200 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారని లెక్క చెప్పిన షర్మిల.. అందర్నీ రైతు ఆవేదనా యాత్ర పేరుతో పరామర్శిస్తానని ప్రకటించారు. దీన్ని ఈ నెల 19న ప్రారంభిస్తున్నారు. సహజంగా ఓదార్పు యాత్ర స్టైల్ ప్రకారం.. ఒక్కొక్కరి పరామర్శకు ఒక్కో రోజు తీసుకుంటారు.ఈ కారణంగా చూస్తే వచ్చే ఏడాది మొత్తం షర్మిల రైతు ఆవేదనయాత్రకే సమయం కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యాత్రను ఎన్నికల కోడ్ పేరుతో నల్లగొండ జిల్లాలోనే ఆపేశారు.

ఒక వేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈ యాత్రతోనే ముగిస్తారు. అంటే పాదయాత్ర ఉండకపోవచ్చన్నమాట. ఒక వేళ2023 చివరిలోనే ఎన్నికలుఉంటే.. పరిస్థితిని బట్టి పాదయాత్ర ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాదయాత్ర చేస్తే అధికారం గ్యారంటీ అని ఆశలు పెట్టుకున్న షర్మిల ఫ్యాన్స్‌కు ఆ పాదయాత్రకు మధ్యలోనే మంగళం పాడటం .. నిరాశ పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close