‘మత్తు వదలరా’ హిట్ కొట్టాడు రితేష్ రానా. తొలి సినిమాకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లావణ్య త్రిపాఠితో ఓ లేడి ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రోజు (బుధవారం) హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా వుంది. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ కూడా కనిపించింది. మొట్టనికి మత్తు వదలరా తరహాలో కొత్త కాన్సెప్ట్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం.