రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో బండారు దత్తాత్రేయకి క్లీన్ చిట్!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు కారణాలను, బాధ్యులను కనుగొనేందుకు కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ తన నివేదికను సమర్పించింది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రానికి వ్రాసిన లేఖకు ఎటువంటి సంబందమూ లేదని తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి సూరత్ సింగ్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ షకీలా షంసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో, అద్యాపకులతో మాట్లాడిన తరువాత యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్ధుల సమస్యను పరిష్కరించడంలో అశ్రద్ద చూపినందునే చివరికి అది రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిందని తమ నివేదికలో తేల్చి చెప్పారు.

రోహిత్ తో సహా మరో నలుగురు విద్యార్ధులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేసిన యూనివర్సిటీ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సబ్ కమిటీ నిర్ణయాన్ని కూడా ద్విసభ్య కమిటీ తప్పు పట్టింది. కొందరు విద్యార్ధుల పట్ల అద్యాపకులు, యూనివర్సిటీ యాజమాన్యం వివక్ష చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. విద్యార్ధుల పట్ల వివక్ష, విద్యార్ధుల ఆత్మహత్యలపై విచారణ జరపడానికి గతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కమిటీల సూచనలను, సలహాలను యూనివర్సిటీ పట్టించుకాలేదని నివేదికలో పేర్కొన్నారు.కనుక యూనివర్సిటీ ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి నిర్దిష్టమయిన మార్గదర్శకాలు తక్షణమే ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించారు.

ద్విసభ్య కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ఊహించినట్లే ఉన్నాయి. ఈ కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు యూనివర్సిటీకి వ్రాసిన లేఖల కారణంగానే ఆ విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్లు ఆందోళన చేస్తున్న విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కానీ కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకే చెందిన ఉద్యోగులతో ఈ ద్విసభ్య కమిటీని అదే శాఖ మంత్రి నియమించారు కనుక నివేదికలో కేంద్రమంత్రులు ఇద్దరినీ ఎక్కడా తప్పు పట్టలేదు. ఇక ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం అయ్యిందో, దానికి పరిష్కార మార్గాలు ఏమిటో యూనివర్సిటీ యాజమాన్యానికి, విద్యార్ధులకి, కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకి కూడా తెలుసు. కనుక ద్విసభ్య కమిటీ తన నివేదికలో కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు. అయినా కమిటీ ఎందుకు వేశారు అంటే ప్రతిపక్షాలను, విద్యార్ధులను చల్లబరచడానికి, కేంద్రమంత్రి బండారు దత్తత్రేయకి క్లీన్ చిట్ ఇవ్వడానికేనని చెప్పవచ్చును.

రోహిత్ మరణించిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నేతలు యూనివర్సిటీ మీద కాకుల్లాగ వాలిపోయి హడావుడి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వారిలో ఎవరూ యూనివర్సిటీవైపు తొంగి చూడలేదు. ఆ తరువాత కమిటీని ఏర్పాటు చేయడం అది ఊహించినట్లే మంత్రిగారికి క్లీన్ చిట్ ఇచ్చేసి తన పని పూర్తయిపోయిందని చేతులు దులుపుకొంది. కానీ నేటికీ యూనివర్సిటీలో సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇదంతా కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లుంది తప్ప వేరే ప్రయోజనం కబడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close