‘గాడ్సే’ టీజర్: సేవ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి ? 

సత్యదేవ్ హీరో తెరకెక్కిన సినిమా గాడ్సే. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. గోపీ గణేష్ దర్శకుడు. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారు” అనే వాయిస్ తో టీజర్ మొదలైయింది. టీజర్ లో చాలా యాక్షన్ చూపించారు. గాడ్సే పాత్ర వరుసగా కాల్పులు జరపడం, గాడ్సేని పట్టుకునే మిషన్ లో ఐశ్వర్య లక్ష్మి ఆఫీసర్ గా కనిపించడం, రాజకీయ నాయకుడిగా పృద్వీ డైలాగు.. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి.. స్టార్ కాస్ట్ అంతా టీజర్ లో కనిపించడం, చివర్లో గాడ్సే చెప్పిన డైలాగు ఇంట్రస్టింగ్ గా వున్నాయి. 

‘ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ సేవ చేస్తే వేల, లక్షల కోట్లు ఎలా వస్తాయి ? ఎందుకంటే రాజకీయ నాయకులంతా ప్రజల డబ్బుని సేవ పేరుతో లూటీ చేస్తున్నారు” అని టీజర్ చివర్లో గాడ్సే పాత్ర చెప్పడంతో అవినీతిపై పోరాటమనే గాడ్సే థీమ్ ని కూడా టీజర్ లో రివిల్ చేశారు. అన్నట్టు.. ఇంతకుముందు సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా తీశాడు గోపీ గణేష్. ఆ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఛాయలు కూడా గాడ్సే టీజర్ లో కనిపించాయి. ‘బ్లఫ్ మాస్టర్’ మంచి సినిమానే. పూరి జగన్నాధ్ స్టయిల్ లో దూసుకుపోయే డైలాగులు, స్క్రీన్ ప్లే వుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు గాడ్సే తో వస్తున్నారు. చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close