టాలీవుడ్ పై ప‌ర‌భాషా న‌టుడి అవాకులూ చెవాకులూ

పొరుగింటి పుల్ల‌కూర మ‌న‌కు రుచి. బ‌య‌టివాళ్ల‌కు కాదు. ప‌ర‌భాషా న‌టుల్ని తీసుకొచ్చి, నెత్తిన పెట్టుకుని, వాళ్ల‌కు పాలాభిషేకాలు చేయ‌డం, అడిగినంత పారితోషికాలు ఇచ్చి గౌర‌వంగా చూసుకోవ‌డం – టాలీవుడ్ కి మాత్ర‌మే అబ్బిన విద్య‌. `పాన్ ఇండియా` మోజొక‌టి పెరిగింది క‌దా? దాంతో… ఎక్క‌డ‌, ఏ న‌టుడు దొరుకుతాడా? తీసుకొచ్చి క్యారెక్ట‌ర్ ఇచ్చేద్దామా? అనే ఆత్రుత‌, ఉత్సాహం చూపిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక్కోసారి స్థాయి లేని వాళ్ల‌ని అంద‌లం ఎక్కిస్తున్నారు. వాళ్ల మార్కెట్ ని దాటి మ‌రీ పారితోషికాలు ఇస్తున్నారు. ఓర‌కంగా… న‌టీన‌టుల పారితోషికాలు అమాంతంగా పెంచేసేది మ‌న నిర్మాత‌లే.

ఇటీవ‌ల ఓ మ‌ల‌యాళ న‌టుడు తెలుగు సినిమాలో కీల‌క పాత్ర పోషించాడు. త‌న‌కు రోజువారీ పారితోషికం ఇస్తామ‌న్న‌ది ష‌ర‌తు. అలా.. దాదాపు 20 రోజుల పాటు త‌న‌పై షూటింగ్ చేశారు. తీరా తీసింది రెండు సీన్లే. సినిమాకి ఇంత అని పారితోషికం ఫిక్స్ చేసుకుంటే.. స‌గానికిపైగా పారితోషికం మిగిలిపోయేది. కానీ నిర్మాత‌లు అలా చేయ‌లేదు. సెట్లో ఇక్క‌డి వాతావ‌ర‌ణాన్ని, డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే తీరుని చూసి స‌ద‌రు న‌టుడు ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. ఇక్క‌డ హాయిగా షూటింగ్ చేసుకుని, త‌న సీమ‌కు వెళ్లి.. `తెలుగు వాళ్ల‌కు సినిమా అంటేనే తెలీదు.. డ‌బ్బులు టిష్యూ పేప‌ర్ల‌లా వాడుతున్నారు` అంటూ నెగిటీవ్ కామెంట్లు చేశాడ‌ట‌. అస‌లు విజ‌న్‌, క్లారిటీ లేని ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర ప‌నిచేశా….అని త‌న‌కు తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర‌, తెలియ‌ని వాళ్ల ద‌గ్గ‌ర కూడా ప్ర‌స్తావిస్తున్నాడ‌ట‌. నిజానికి ఈ సినిమా ద్వారా.. త‌న కెరీర్‌లోనే అత్య‌ధిక పారితోషికం అందుకోగ‌లిగాడు ఆ న‌టుడు. అంత తీసుకున్నా – ఎంత చుల‌క‌న భావం? అదే డ‌బ్బులో స‌గం తెలుగు న‌టుడికి ఇస్తే – అంత‌కంటే బాగా న‌టించేవాడు. కానీ ఏం చేస్తాం? కోరి తెచ్చుకున్న క‌ష్టాలు కూడా భ‌రించాల్సిందే. ఇప్పుడు ఆ న‌టుడి అవాకులూ చెవాకులూ వినాల్సిందే. అంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close