‘ఆహా’ కోసం సుకుమార్ వెబ్ సిరీస్‌

‘ఆహా’లో మంచి కంటెంట్ పొందు ప‌ర‌చ‌డానికి ఆ సంస్థ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకుంటోంది. పేరున్న ద‌ర్శ‌కుల్ని, ర‌చ‌యిత‌ల్ని, న‌టీన‌టుల్ని తీసుకొచ్చి – కంటెంట్ కి క్రేజ్ పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆహాలో బాల‌య్య అన్ స్టాప‌బుల్ సూప‌ర్ హిట్టు. ఇదే ఊపులో కొన్ని వెబ్ సిరీస్‌లు, చాట్ షోలూ చేసి…. ఆహాని నిల‌బెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది యాజ‌మాన్య వ‌ర్గం. అందులో భాగంగా సుకుమార్ తో ఓ భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంద‌ని టాక్‌.

పుష్ప కంటే ముందు.. ఆహాలో సుకుమార్ ఓ వెబ్ సిరీస్ చేయాల్సింది. దానికి సంబంధించిన స్క్రిప్టు పై సుకుమార్ దాదాపుగా 3 నెల‌లు శ్ర‌మించాడు. అయితే బ‌డ్జెట్ ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల‌… ఆ వెబ్ సిరీస్ ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని ధైర్యంగా ప‌ట్టాలెక్కించాల‌ని ఆహా భావిస్తోంద‌ట‌. అందుకే ఆ స్క్రిప్టుతో ప్ర‌యోగం చేయాల‌నుకుంటోంది. అయితే దీనికి సుకుమార్ ద‌ర్శ‌కుడు కాడు. కేవ‌లం క‌థ‌. స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తాడంతే. సుకుమార్ రైటింగ్స్, ఆహా క‌లిపి.. ఈ ప్రాజెక్టు చేప‌డ‌తాయి. ఇది కూడా `పుష్ప‌`లాంటి క‌థే. ఓ జీరో, హీరోగా ఎదిగిన వైనంతో సాగే సిరీస్‌. ఓ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ఈ వెబ్ సిరీస్ లో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. ఆ హీరో ఎవర‌న్న‌ది త్వ‌ర‌లో తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close