చైతన్య : అతి వినయం ధూర్త లక్షణం..!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే ఆయన మనస్థత్వాన్ని మరోసారి సీజేఐ ఎన్వీ రమణ సాక్షిగా బయట పెట్టుకున్నారు. గతంలో ఎంతో మందిపై కత్తి దూసి.. అనవసరంగా దాడులు చేసి.. శత్రువులకే శత్రువుగా చూసి.. చివరికి తెల్లజెండా ఎగరేసినట్లుగానే ఇప్పుడు సీజేఐ ఎన్వీ రమణ విషయంలోనూ జగన్ మారిపోయారు. అనూహ్యంగా .. సీజేఐగా ఆయన ఎన్నికయిన ఎనిమిది నెలల తర్వాత ఎక్కడా లేని వినయాన్ని తెచ్చుకుని గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు.

ఆ ఆరోపణలన్నీ తప్పుడువేనని అంగీకరించేసిన జగన్ !

సీజేఐ ఎన్వీ రమణ విషయలో ఏపీ సీఎం జగన్ ప్రదర్శిస్తున్న అతి వినయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే ఇది సాధారణం కాదు.. అసాధారణం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఓ ఏడాది వెనక్కి వెళ్తే కాబోయే సీజేఐ ఎన్వీ రమణపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి చీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు. అజేయకల్లాం అనే సలహాదారుతో ఆ లేఖను తానే స్వయంగా బయట పెట్టించారు. జస్టిస్ ఎన్వీ రమణపై దేశవ్యాప్తంగా భారీగా ఖర్చు పెట్టి.. పీఆర్‌ సంస్థను నియమించుకుని తప్పుడు ప్రచారం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ ప్రభుత్వం అలా టార్గెట్ చేసింది మొదటి సారి కాదు అంతకు ముందు సారి మాజీ అడ్వేకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై రాజధాని భూముల కేసులు పెట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పెట్టిన ఆ ఎఫ్‌ఐఆర్‌లో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అంతకు ముందెప్పుడో.. తన తాబేదార్లు అయిన వ్యక్తులతో జస్టిస్ ఎన్వీ రమణపై చదువుకునేటప్పుడు ఓ కేసు ఉందని పిటిషన్లు వేయించి భంగపడ్డారు. జస్టిస్ ఎన్వీ రమణ టార్గెట్‌గా జగన్ సుదీర్ఘ కాలంగా చేస్తున్న తప్పుడు ప్రచారం.. ఆరోపణలను నిన్నటి పరిణామాలతో జగన్ తప్పు అని అంగీకరించినట్లే అయింది.

సీజేఐ అయిన తర్వాత కూడా మనసు మార్చుకోలేదు..! ఇప్పుడెందుకు ?

సీజేఐకి ఎన్వీ రమణ ఎన్నికయిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే తెలంగాణ సర్కార్ మాత్రం గొప్ప ఆహ్వానం పలికింది. కానీ ఇప్పుడు మాత్రం సీజేఐ ఎన్వీ రమణ స్వగ్రామంలో పర్యటించేందుకు మూడు రోజుల కార్యక్రమాలు ఖరారు కాగానే ప్రభుత్వం అత్యంత ప్రయారిటీగా తీసుకుంది. ఎక్కడిక్కడ అత్యంత వినయవిధేయలతో మర్యాదలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీజేఐని శాలువా కప్పి గౌరవించారు. ప్రభుత్వం తరపున అధికారికంగా తేనీటి విందు ఏర్పాటు ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు..? ప్రోటోకాల్ అధికార మర్యాదల గురించి ఇప్పుడే తెలిసిందా ?

దాడులతో దారికి రాలేదని కాళ్ల బేరానికి వెళ్లారా ?

ఓ వ్యవస్థపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్నీ చేసేసిన తర్వాత కూడా ఇంకా ఏమీ సాధించలేని పరిస్థితుల్లో కాళ్ల బేరానికి వెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంత కాలం ఆయన చేసిన దాడులను న్యాయవ్యవస్థ అంత తేలికగా మర్చిపోతుందా అన్దే ఇక్కడ అసలు పాయింట్. పైగా జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. న్యాయమూర్తులను కాకా పట్టడం… విందులు ఇవ్వడం ద్వారా తీర్పులు మారవు. చట్టాలు.. రాజ్యాంగాలకు లోబడే తీర్పులు ఉంటాయి.

అతి వినయం ధూర్త లక్షణం.. ఆ విషయాన్ని సలహాదారులు చెప్పలేదా !?

మొత్తంగా చూస్తే ఇప్పుడు న్యాయవ్యవస్థపై అమితమైన గౌరవం ప్రదర్శించడం అత్యవసరం అని ఆయన సలహాదారులుగా చెప్పినట్లుగా ఉంది. అందుకే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సీజేఐపై అతి వినయం ప్రదర్శించారు. సీజేఐ ప్రభుత్వమే అధికార మర్యాదలు ఇస్తాననన్నప్పుడు తిరస్కరించలేరు. అలా తిరస్కరిస్తే సీఎంపై ఆయన వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం చేస్తారు. అందుకే ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం.. ఎక్కడా వివాదాస్పదం కాకుండా చూసుకున్నారు. దీన్ని బట్టి జగన్ తాను చేసిన నేరాలు.. ఘోరాల నుంచి రక్షణ లభిస్తుందని అనుకుంటే.. అది భారతీయ వ్యవస్థలను కించ పరిచినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close