అందరికీ రిజర్వేషన్లే పరిష్కారమా.. !

అణగారిన వర్గాలకు కొంత కాలం రిజర్వేషన్లు అమల్లో ఉంటే సమన్యాయం జరుగుతుందని అప్పట్లో డాక్టర్ అంబేద్కర్ భావించారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలైనా ఇంకా రిజర్వేషన్ల కోసం కొత్తగా వివిధ కులాల వారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు హర్యానాలో జాట్లు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు.

రిజర్వేషన్ల ఫలాలు నిమ్న కులాల్లోని అందరికీ అందాయా అంటే అందలేదు. అందులో అనుమాన లేదు. ఒకసారి ఆ ఫలితం అందుకున్న వారి కుటుంబీకులు, బంధువులే మళ్లీ మళ్లీ ఫలాలను అందుకుంటున్నారు. ఒక్కసారి కూడా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందని కోట్లాది మంది పేద దళిత, ఆదివాసీ, ఓబీసీలు ఇంకా పేదిరకంలోనే మగ్గుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కొన్ని కుటుంబాలు మాత్రమే భారీగా లబ్ధి పొందాయి.

ఇప్పుడు హర్యానాలో జాట్ల ఆందోళన చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాష్ట్రంలో జాట్లను కాదని ఏదీ జరగదు. వారికి ఇష్టం లేని పనులను ప్రభుత్వాలు కూడా చేయలేవు అంటారు. అసలు, 1966 లో ఆవిర్భవించిన ఈ రాష్ట్రానికి మొదటి నుంచీ జాట్ వర్గీయులే ముఖ్యమంత్రులు. ఇప్పుడున్న మనోహర్ లాల్ ఖట్టర్ తొలి జాటేతర ముఖ్యమంత్రి. ఆయనకు ముందు వరకు ఉన్న ప్రతి సీఎం జాట్ వర్గీయుడే. అంటే హర్యానాలో జాట్ల డామినేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. భూస్వాములుగా, గ్రామ పెద్దలుగా, ఖాప్ పంచాయితీల్లో తీర్పు చెప్పే పెదరాయుళ్లుగా, అక్కడ జాట్లకు తిరుగులేదు. అయినా మా కులంలో పేదలున్నారంటూ రిజర్వేషన్లు కోరుతున్నారు.

హర్యానాలో జాట్లకే గనక రిజర్వేషన్లు కల్పిస్తే ఇక దేశంలో నాన్ రిజర్వేషన్ కేటగిరీ కులం అనేది ఉండటం అన్యాయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలా మంది పేదలున్నారనేది వీరి వాదన. జాట్లు, పటేళ్లలోని పేదల కంటే బ్రాహ్మణుల్లోనే గరీబులు ఎక్కువంటున్నారు. అంతే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని కాపులతో పాటు ఇతర అగ్రవర్ణాలకు కూడా ఎంతో కొంత కోటా ఇస్తే భవిష్యత్తులో వాళ్లు ఆందోళన బాట పట్టే చాన్స్ ఉండదని కొందరంటున్నారు.

కొందరు వ్యంగ్యానికి ఓ సలహా చెప్తున్నారు. అగ్రవర్ణాలకు కూడా కోటా నిర్ణయించి, ప్రతి కులం ఏదో ఒక రిజర్వేషన్ కేటిగిరీలోకి రావడం మంచిదని వారి సూచన. వంద శాతం రిజర్వేషన్లు, అందరికీ ఎంతో కొంత కోటా. ఇక కొత్తగా రిజర్వేషన్ కోసం గొడవలు రావని కొందరు అంటున్న మాటల్లో అర్థం ఉంది. రిజర్వేషన్ల కోసం కొత్తగా డిమాండ్ చేసే వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను గమనిస్తే, అసలు ఈ పదానికి అర్థం మారిపోయిందేమో అనిపిస్తుంది. గుజరాత్ తో పటేళ్ల ప్రాబల్యం ఏమిటో అందరికీ తెలుసు. రాజకీయంగా వాళ్లదే డామినేషన్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పటేల్ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తే. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి, అందరికీ సమాన అవకాశాల కోసం పనిచేసి ఉంటే ఈపాటికి దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు కనిపంచేవి కావు. రాజకీయ అవినీతి భయంకరంగా పెరిగిపోవడం వల్లే ఇలాంటి కొత్త సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారం కనుగొనాల్సింది రాజకీయ నాయకులే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close