సాక్షిని కాపాడుకోవడం కోసమే జగన్ డిల్లీకి?

నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి నిన్న రాత్రి తెదేపాలో చేరడంతో చివరికి ఈ సస్పెన్స్ సీరియల్ ముగిసింది. ఇంతవరకు ప్రతిపక్ష పార్టీతో ఇబ్బందులు ఎదుర్కోవడమే తప్ప దానిని ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉంటున్న తెదేపా నేతలు ఇప్పుడు దానిని ఇంత ఘోరంగా దెబ్బ తీసినందుకు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతుంటే, సహజంగానే వైకాపా ఇది చాలా అన్యాయం, అక్రమంటూ ఆక్రోశిస్తోంది.

తమ ఎమ్మెల్యేలను చేర్చుకొని తెదేపా బాగుపడదని శాపనార్ధాలు పెడుతోంది. అప్పుడే కడప, కర్నూలు జిల్లాలలో తెదేపాలో అసమ్మతి భగ్గుమందని, ఏ క్షణాన్నయినా తెదేపాకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని వైకాపా తన చేతిలో ఉన్న స్వంత మీడియాలో వ్రాసిపడేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలలో చాలా మందిని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినా కేవలం నలుగురిని మాత్రమే ఆకర్షించగలిగిందని, మిగిలిన వారందరూ పార్టీతోనే ఉన్నారని చెప్పుకొచ్చింది. బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతున్నట్లుగా ఓటుకి నోటు కేసు, గ్రేటర్ ఎన్నికలలో తెదేపా ఎదుర్కొన్న పరాభావాలకి ఈ చేరికలకు ముడిపెడుతూ ఏదేదో వ్రాసుకొని తన మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా వెళ్ళగ్రక్కుకొంది.

పార్టీకి చెందిన నలుగురు ముఖ్యమయిన నేతలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఎవరికయినా బాధ కలగడం సహజమే. జగన్మోహన్ రెడ్డి దుందుడుకుగా మాట్లాడటంతోనే వైకాపాకి ఈ సమస్య వచ్చిందనే సంగతి అందరికీ తెలుసు. కనుక అది స్వయంకృతాపరాధమే. దానిని కప్పి పుచ్చుకొని జగన్ పరువు కాపాడుకోవడానికే ఈ సోదంతా చెప్పుకొన్నట్లుంది. అందుకే ఈ స్టోరీకి తెదేపా నేతల బెదిరింపులు, ప్రలోభాల ఫ్లాష్ బ్యాక్, హిస్టరీ వగైరా ఉందని వ్రాసుకొచ్చింది. కానీ జరుగకూడని నష్టం జరిగిపోయిన తరువాత కూడా వైకాపా మేల్కొనకుండా తప్పు మీద తప్పు చేసుకొంటూ ముందుకు సాగుతున్నట్లుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సాక్షి పత్రికను స్వాధీనం చేసుకొంటామని హెచ్చరించిన సంగతి పట్టించుకోకుండా యధాప్రకారం ఆయనకు, తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేదో వ్రాసిపడేసి తన అక్కసు తీర్చుకొంది.

తెదేపా ప్రభుత్వాన్ని కూల్చుతామని జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకొన్నందుకు ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను, ఓక ఎమ్మెల్సీని పోగొట్టుకోవలసి వచ్చింది. ఈనాడు అధినేత రామోజీరావు గురించి సాక్షి పత్రికలో చాలా రాతలు రాసి, చివరికి ఆయన ముందు జగన్ మోకరిల్లవలసివచ్చింది. ఇవ్వన్నీ మరిచిపోయి చేతిలో బలమయిన మీడియా ఉంది కదా అని ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేసేవిధంగా కధనాలు వ్రాసుకొస్తే ఏదో ఒకరోజు ‘జగన్ మనసాక్షి’ కూడా చెయ్యి జారిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎన్నడూ ఇటువంటి హెచ్చరికలను చేయని చంద్రబాబు నాయుడు సాక్షిని స్వాధీనం చేసుకొంటామని అన్నారంటే అదేదో జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి అన్నమాట కాదనే భావించవలసి ఉంటుంది. ఒకవేళ జగన్ చేతిలో నుండి సాక్షిని లాగేసుకొంటే అప్పుడు అతని పరిస్థితి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కవచకుండలాలు కోల్పయిన కర్ణుడు పరిస్థితే అవుతుంది.

చంద్రబాబు నాయుడు హెచ్చరికను జగన్ సీరియస్ గానే తీసుకొన్నారో లేదో తెలియదు కానీ బహుశః ఆ కవచ కుండలాలను కాపాడుకోవడం కోసమే ఆయన హడావుడిగా డిల్లీ వెళ్ళిఉంటారేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇకనయినా ఏకపక్షంగా నిర్ణయాలు, సంచలన ప్రకటనలు చేయడం మానుకొని పార్టీలో సీనియర్ నేతలతో ప్రతీ విషయం గురించి చర్చించి, సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం అలవరుచుకొన్నట్లయితే పార్టీకి ఇటువంటి దుస్థితి దాపురించదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close