ఇలాంటి మాటలతోనే జగన్‌ను మిస్‌గైడ్‌ చేశారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాలోకి వచ్చిన నేపథ్యంలో వైకాపానుంచి నిందలు, దూషణలు చాలా సహజంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా వైకాపానుంచి తెదేపా వైపు చూస్తున్నారనే అనుమానాలు ఉన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా పార్టీ ఖండనలు ఇప్పిస్తూ ఉన్నది. చంద్రబాబు వైఖరిని తిట్టిస్తూ ఉన్నది. ఇదంతా సహజంగా జరిగే పరిణామమే. అదే సమయంలో వైకాపా కరడుగట్టిన నాయకులు కూడా తమదైన శైలిలో చంద్రబాబు ఎత్తుగడలను ఆడిపోసుకుంటున్నారు. అయితే ఒక కొత్త ట్విస్టు ఏంటంటే.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం.. ఆరుగురు తెదేపా ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, తొందర్లోనే వారంతా వైకాపాలోకి వస్తారని సరికొత్త ట్విస్టు ఇస్తున్నారు.

తెదేపాలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారంటూ విమర్శలు వచ్చినంత కాలమూ.. ”అసలు తెదేపాలో ఏం ఉన్నది గనుక.. అందులోకి వెళ్తారు” అంటూ వైకాపా నేతలు ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్‌ ఎంత రాయబారాలు నడిపినా పట్టించుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన భూమా సహా నలుగురు వెళ్లిపోయిన నేపథ్యంలో ఇక ఆ మాటలకు విలువ లేకుండా పోయింది. తెదేపాలో ఏమీ లేకపోయినప్పటికీ.. కనీసం వారి వద్ద అధికారం ఉంది.. అందుకే అందరూ వెళుతున్నారని నిన్న తేలింది.

వైకాపానుంచి నలుగురు ఎమ్మెల్యేలు వెళితే.. దానికి కౌంటర్‌ అన్నట్లుగా.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెదేపా నుంచి మా పార్టీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు రాబోతున్నారు.. నా ద్వారా ఈ చేరికలు జరుగుతాయి అంటూ సెలవిచ్చారు. మరి ఆయన లెక్క ప్రకారం.. వైకాపా వద్ద ఏం ఉన్నదని తెదేపా ఎమ్మెల్యేలు అధికార పార్టీని వదిలేసి వచ్చేస్తారనేది తర్వాతి సంగతి. కాకపోతే.. పిన్నెల్లి వంటి వారు ఇలాంటి డాంబికపు మాటలతో జగన్‌ను కూడా బురిడీ కొట్టించారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఆరుగురు తెదేపా ఎమ్మెల్యేలు తనద్వారా పార్టీలోకి వస్తారని పిన్నెల్లి చెబుతున్నారు. ఇదేమాదిరిగా మరికొందరు కూడా జగన్‌కు చెప్పి ఉండే అవకాశం ఉంది. బహుశా ఇలాంటి వాళ్ల డాంబికపు మాటలు నమ్మినారేమో గానీ.. 21 మంది తెదేపా ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు.. నేను సర్కారును కూలుస్తా.. అని ప్రకటించి జగన్‌ కొరివితో తల గోక్కున్నారు.

దీన్ని బట్టి చూస్తే.. ఆడంబరపు ప్రకటనల ద్వారా పిన్నెల్లి వంటి వారు జగన్‌కు చేటు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పార్టీలో విశ్వాసం నింపడానికి ‘తెదేపా వాళ్లు మాతో టచ్‌లో ఉన్నారు’ లాంటి మాటలు ఉపయోగపడవచ్చు అని వారు అనుకోవచ్చు గానీ.. నిజానికి ఈ మాటలే చంద్రబాబు వ్యూహాలను యాక్టివేట్‌ చేసి.. వైకాపా పతనానికి బాటలు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close