రామ్… పోలీసా? డాక్ట‌రా?

రామ్ – లింగు స్వామి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `ది వారియ‌ర్‌` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ ని పోలీస్ గెట‌ప్‌లో చూపించారు. రామ్ పోలీస్ గా క‌నిపించ‌డం ఇదే తొలిసారి. కాబ‌ట్టి… ఆ లుక్ త‌న‌కు కొత్త‌గా ఉండొచ్చు. అయితే… ఈ సినిమాలో రామ్ డాక్ట‌ర్ గానూ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఒకే వ్య‌క్తి అటు పోలీస్ గా, ఇటు డాక్ట‌ర్‌గా రెండు వృత్తులు చేయ‌డం అసాధ్యం కాబట్టి.. ఈ విష‌యంలో ఏదో ట్విస్టు ఉండే ఉంటుంది. రామ్ ద్విపాత్రాభిన‌యం ఏమైనా చేయ‌బోతున్నాడా? అనే అనుమానాలూ ఉన్నాయి. `రెడ్‌`లో రామ్ ది డ్యూయ‌ర్ లోలే. `వారియ‌ర్‌` కూడా అలాంటి క‌థే అవునా? కాదా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఫ్యాక్ష‌నిజం కూడా ట‌చ్ చేశార్ట‌. ఓ ఫ్యాక్ష‌న్ ముఠాని ప‌వర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే క‌థ‌. కాక‌పోతే.. హీరో పోలీస్ అవ్వ‌డం వెనుక వెరైటీ స్కీమ్ ఉంటుంద‌ట‌. మ‌రి దానికీ ఈ డాక్ట‌ర్ ఎపిసోడ్ కీ ఏమైనా లింకు ఉటుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆర్య‌’ @ 20 ఏళ్లు: ప్రేమ‌క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌!

'ఐ ల‌వ్ యూ.. యూ ల‌వ్ మీ..' అని బ‌తిమాలుకొనేది ఒక త‌ర‌హా ప్రేమ క‌థ‌. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా - నువ్వు కూడా న‌న్ను ప్రేమించాల్సిందే' అని బ‌ల‌వంతం చేసేది మ‌రో త‌ర‌హా...

బేలగా జగన్ – అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేస్తున్నారు !

నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఎక్కడ.. ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ ఎక్కడ ?. మొదటిది ఏడాదిన్నర కిందట.. రెండోది పోలింగ్ కు వారం...

పోలింగ్ రోజున రాపిడో ఉచిత సేవలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. సోమవారం...

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close