జగనన్న కోత: రివర్స్ పిఆర్సి పై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ సంఘాలు ఎప్పటినుండో పీఆర్సీ కోసం విజ్ఞప్తులు డిమాండ్లు చేస్తూ ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో సమావేశమై, పిఆర్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో లు అర్ధరాత్రి విడుదల అయ్యాయి. అయితే విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉద్యోగ సంఘాలకు పుండు మీద కారం చల్లినట్లు చేశాయి. ఇవాళ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం విడుదల చేసిన జిఓ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. అవసరమైతే సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే..

జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట ఇస్తూ 11వ పిఆర్సి ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ చివరికి విడుదలైన జీవోల ప్రకారం చూస్తే ఈ పీఆర్సీ ఉద్యోగులకు లాభం కంటే నష్టం కలిగించేలా ఉండడంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. రివర్స్ టెండరింగ్ తరహాలో ఇది రివర్స్ పిఆర్సి అని, దీనిని తాము ఒప్పుకోమని ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. హెచ్ ఆర్ ఏ లో కోత విధించడమే కాకుండా, ఇవ్వాల్సిన డి ఏ లను కూడా ఐఆర్ లో అడ్జస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం అతి తెలివి తేటలు చూపించి ఉద్యోగులను దెబ్బ తీసిందని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. సి సి ఎ ఎత్తివేయడం, రిటైర్డ్ ఉద్యోగుల అంత్యక్రియల పెన్షన్ లను తగ్గించడం, గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని రద్దు చేయడం, ఇప్పటికే ఉన్నటువంటి ఐఆర్ అంటే తక్కువ ఐఆర్ వచ్చేలా చేయడం, క్వాంటం పెన్షన్ స్లాబ్ లలో మార్పులు చేయడం ద్వారా ఉద్యోగులు నష్టపోయేలా చేయడం, 80 సంవత్సరాల వరకు వచ్చే అదనపు పెన్షన్ రద్దు చేయడం వంటి నిర్ణయాల కారణంగా జీవోలు ఇచ్చిన ఈ రోజుని చీకటి దినంగా తాము భావిస్తున్నామని, అశాస్త్రీయంగా ఇచ్చిన ఈ పీఆర్సి ను తిరస్కరిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మొత్తం మీద పేరుకు పదకొండవ పిఆర్సి ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటూ, నిజానికి తమకు రావలసిన వేతనాల్లోనే 10 నుంచి 15 శాతం పైగా కోత విధించడం తో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు – ప్రభుత్వ నిర్ణయంపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా తాము వెనుకాడమని హెచ్చరించారు. దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close