ఒబామా – పిల్లలు: విడదీయలేని అనుబంధం

హైదరాబాద్: దివంగత ప్రధాని జవహర్‌లాల్ ‘చాచా’ నెహ్రూలాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. చిన్న పిల్లలు కనబడితే కొద్దిసేపు వారితో గడపకుండా ఉండరు. గత ఎనిమిదేళ్ళుగా అమెరికా అధ్యక్షుడి హోదాలో దేశంలోగానీ, విదేశాలకు వెెళ్ళినాగానీ ఆయన పిల్లలతో ఆడుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు తీసిన ఫోటోలతో అమెరికా ఔత్సాహిక పారిశ్రామికవేత్త మైఖేల్ స్కోల్నిక్ ట్విట్టర్‌లో #ObamaAndKids పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ సృష్టించారు. అది ఇప్పుడు ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఒబామా ముద్దాడిన పిల్లలలో ఇండియన్ అమెరికన్స్‌, ఆఫ్రికన్ అమెరికన్స్‌తోసహా అన్ని రంగులవారు, జాతులవారు ఉన్నారు. ఆ ఫోటోలలో పసిపిల్లలతో ఆయన చేసిన అనేక ఫీట్లలో కొన్ని నవ్వుపుట్టించేవిధంగా ఉన్నాయి.

ObamaAndKids1

ఒబామాకు మాలియా(17), సాషా(14) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అధ్యక్ష పదవినుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అనేకసార్లు ఇంటర్వూలలో చెప్పారు. అమెరికా అధ్యక్షుల చరిత్రలో పిల్లలపై ఇంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి మరొకరు లేరని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close