హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ పోరాటం తప్పదు !

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట తప్పింది. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించారు. దీంతో నందమూరి బాలకృష్ణ అసంతృప్తికి గురయ్యారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

స్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లలో జిల్లాల కేంద్రాలు కొన్ని మారిపోయాయి. మారిపోయిన వాటిలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా . దీంతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త జిల్లాలు ప్రకటించినా హిందూపురం జిల్లా అవుతుందని అనుకున్నారు. కానీ తేడా వచ్చేసింది.

హిందూపురం ప‌ట్టణ ప‌రిస‌రాల్లో ప్రభుత్వ కార్యాల‌యాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూమి పుష్కలంగా ఉంద‌నన్నారు. అందుకే జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయవద్ద ..హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని బాలకృష్ణ కోరుతున్నారు. నెల రోజుల పాటు అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే.. బాలకృష్ణ ఉద్యమం చేస్తారేమో చూడాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close