ఆన్‌లైన్‌లో టీఆర్ఎస్, బీజేపీ “ట్రెండింగ్” కీచులాటలు !

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆఫ్‌లైన్‌లో ఏం జరగలేదు. కేసీఆర్ డుమ్మా కొట్టడంతో పర్యటన సాఫీగా సాగిపోయింది. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం రెండు పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. ట్విట్టర్ ట్రెండింగ్‌లతో హడావుడి చేసుకున్నారు. ఇలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిందని మీడియాకు సమాచారం ఇచ్చుకున్నారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ ప్రశ్నించారని టీఆర్ఎస్ ప్రకటించుకుంది. “ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ తెలంగాణ” అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయిందనిచెప్పుకుంది. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయని తెలిపింది.

బీజేపీ ఏమీ తక్కువ తినలేదు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి ఎయిర్‌పోర్టులో స్వాగతం చెప్పలేదు. దీంతో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా.. సీఎం రాకపోవడంతో రాష్ట్ర బీజేపీ విమర్శలకు దిగింది. షేమ్ ఆన్ యు కేసీఆర్ అంటూ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారని బీజేపీ ప్రకటించారు. ఈ హ్యష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసిందని తెలిపింది. టీఆర్ఎస్ ట్రెండ్ చేసిన హ్యాష్ ట్యాగ్ కంటే ఎక్కువే వచ్చాయని బీజేపీ చెబుతోంది.

ట్విట్టర్ విషయంలో టీఆర్ఎస్ చాలాయాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రైతు భరోసా విషయంలోనూ ఓ సారి కేసీఆర్‌ను పొగుడుతూ ట్రెండ్ చేసుకున్నారు. అయితే ఇలాంటి వాటిలో బీజేపీ మాస్టర్. ఆ పార్టీకి తెలిసినన్ని ట్రిక్కులు ఎవరికీ తెలియదు. అయితే రెండూ అధికార పార్టీలే కావడంతో .. తమ తమ కార్యకర్తల్ని పురమాయించి.. ట్విట్టర్‌లో పోటా పోటీ ట్రెండింగ్‌లు తెచ్చుకున్నారు. కానీ దీని వల్ల ఉపయోగం ఏమిటనేదానిపై ఆ పార్టీలకు స్పష్టత ఉందో లేదో క్లారిటీ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close