నిజ జీవితంలోనూ న‌వ్వుల పాలైన క‌మిడియ‌న్‌

కామెడీ చేయాలంటే స్క్రీన్ పైనే చేయాలి. బ‌య‌ట‌.. అందులోనూ జ‌నాలను బ‌క‌రాల్ని చేయాల‌ని చూసి, త‌ద్వారా న‌వ్వుకుందామంటే.. ఆ త‌ర‌వాత న‌వ్వుల పాల‌వ్వాల్సి వ‌స్తుంది. ఈ విష‌యం తెలిసో.. తెలీకో.. రాహుల్ రామ‌కృష్ణ ఓ ప్రాక్టిక‌ల్ జోక్ వేసి న‌వ్వుల పాల‌య్యాడు.

శుక్ర‌వారం రాత్రి… ఏ మూడ్‌లో ఉన్నాడో తెలీదు గానీ… `నేనిక సినిమాలు మానేస్తున్నా.. ఎవ‌రేం అనుకుంటే నాకేంటి.. ఇదే నా నిర్ణ‌యం` అంటూ వీరావేశంలో ట్వీట్ చేశాడు. దాన్ని కొంత‌మంది సీరియ‌స్ గా తీసుకున్నారు. `అదేంట‌న్నా.. ఇలాంటి నిర్ణ‌యం…. అంతా బాగానేఉంది క‌దా..` అంటూ సానుభూతి చూపించారు. `నీ నిర్ణ‌యం మార్చుకో.. లేదంటే నామీద ఒట్టే` అంటూ… మ‌రీ ఎమోష‌న‌ల్ గా తీసుకున్న‌వాళ్లూ ఉన్నారు. ఓ తెలంగాణ అభిమాని అయితే… `కేసీఆర్ మీద ఒట్టు..` అంటూ ఇంకాస్త ముందుకెళ్లాడు. ఇంకొంత‌మంది మాత్రం `ఇది కూడా కామెడీయేనా.. ఏ వెబ్‌సిరీస్ కోసం` అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి రోజంతా.. సోష‌ల్ మీడియాలో ఇదే చ‌ర్చ‌.

కానీ సాయింత్రం తీరిగ్గా.. `నేనెక్క‌డికి పోతా.. ఇక్క‌డే ఉంటా. ఇన్ని డ‌బ్బులు, సుఖాన్ని ఇచ్చిన సినిమాని ఎలా వదులుతా.. జోక్ చేశా.. ఫూల్స్` అని ట్వీట్ చేశాడు. దాంతో ఈ ఎపిసోడ్ కి ముగింపు ప‌లకాల‌నుకున్నాడు. కానీ జ‌నాలు వ‌దులారేంటి? ఈసారి మాత్రం య‌మ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. `నువ్వు జోకులేసుకోవ‌డానికీ, బ‌క‌రాలు చేసుకోవ‌డానికీ మేమే దొరికామా` అంటూ రివ‌ర్స్ కౌంట‌ర్లు ఇస్తున్నారు. దీనికంటే నువ్వు సినిమాల్లో మానేయ‌డ‌మే ఉత్తమం.. అంటూ స‌ల‌హాలూ ప‌రేస్తున్నారు. ఏదోజోక్ చేశా.. ఫ్రాంక్ చేశా.. అన‌డంలో త‌ప్పులేదు. ఫూల్స్ అంటూ ఈ ట్వీట్‌ని న‌మ్మిన వాళ్ల‌నంద‌రినీ బ‌క‌రాలు చేసేశాడు. అది మాత్రం దారుణ‌మే. సినిమాలు చేయ‌డం, చేయ‌క‌పోవ‌డం త‌న చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అంతిమంగా ఇది త‌న జీవితం దాన్ని అడ్డు పెట్టుకుని ఓ రోజంతా ఎమోష‌న‌ల్ డ్రామా న‌డిపి, చివ‌ర‌కు ఫూల్స్ అన‌డం మాత్రం పిచ్చికి ప‌రాకాష్ట‌.
దీని ద్వారా జ‌నాల్ని న‌వ్వించాల‌నుకున్నాడా, లేదంటే కావాల‌ని న‌వ్వుల పాల‌వ్వాల‌నుకున్నాడా..? ఇప్ప‌టికైతే తానే ఫూల్ అయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close