ఉద్యోగుల విషయంలో సీఎం అలా.. వైసీపీ ఇలా ! ఎవరు నిజం ?

” నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. మీరు లేకపోతే తాను లేను. ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం” ఇది పీఆర్సీ విషయంలో కొత్తగా సాధించిన విజయాల కారణంగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లిన ఉద్యోగ సంఘ నేతలతో సీఎం జగన్ అన్నమాటలు. ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ ఇంకా చాలా చెప్పారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఉద్యోగుల ఉద్యమం జరిగినంత కాలం వైసీపీ నేతలు.. వైసీపీ మీడియా చేసిన ప్రచారమే ఇప్పుడు హైలెట్ అవుతోంది.

వైసీపీ నేతలు ఉద్యోగుల్ని నానా మాటలన్నారు. లంచాలు తీసుకుంటారన్నారు. లక్షలు జీతాలు సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారయితే మేం జీతాలు తీసుకోకుండా పని చేస్తాం.. మీరు సిద్ధమా అని సవాల్ కూడా చేశారు. ఇక ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగుల మీద లేనిపోని విషయాలు చెబుతూ ఇంటింటికి ప్రచారం చేసింది. వాలంటీర్లతో వారు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రచారం చేసింది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్పారు. ఉద్యోగులపై ప్రజల్లో తిరుగుబాటు తీసుకు రావాలని చూశారని ఆరోపించారు.

ఇక వైసీపీ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. ఉదయమే కొమ్మినేని శ్రీనివాసరావు చర్చా కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం అర్థరాత్రి వరకూ సాగుతుంది. మధ్యంలో కామన్ మ్యాన్ వాయిస్ అంటూ వైసీపీ నేతల వాయిస్‌ను వినిపిస్తూ ఉండేవారు. అంటే ఉద్యోగులపైవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి మాత్రం ఉద్యోగులంటే ప్రభుత్వం అంటారు. ఈ డబుల్ మీనింగ్ వ్యవహారాలకు అర్థం ఏమిటో సామాన్య ఉద్యోగులకు అర్థం అయింది కానీ.. ఉద్యోగ సంఘం నేతలకు అర్థం అయినట్లుగాలేదు. వారికి అర్థం అయినా … అర్థం కానట్లు ఉంటారని.. అదే స్ట్రాటజీ అని ఉద్యోగులు అనుకున్నా.. అందులో తప్పేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close