ఇక సింగరేణి గ్రౌండ్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ !

బడ్జెట్ మీద నిన్నటిదాకా బీజేపీపై విరుచుకుపడిన టీఆర్ఎస్ తాజాగా సింగరేణి అంశాన్ని ఎత్తుకుంది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటు లేఖ రాశారు. దాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునేలా చేశారు. ఇటీవల కేంద్రం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించింది. వాటిని సింగరేణికి కేటాయించకపోవడం అంటే ప్రైవేటీకరణకు తొలి మెట్టు అని.. ఇలాంటి వాటిని తాము సహించబోమని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖ… కాస్త ఘాటు పదాలతోనే ఉంది.

నేడో రేపో సింగరేణిని వేలం వేసేస్తున్నారన్నట్లుగా కేటీఆర్ లేఖ సంధించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తక్షణం వేలం ఆపాలన్నారు.

కేటీఆర్ లేఖపై బీజేపీ ఉలిక్కి పడింది. బొగ్గు బ్లాకుల వేలం సహజంగానే జరుగుతోందని సింగరేణికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. గతంలో ఒడిషాలో తొమ్మిది బ్లాకుల్ని తెలంగాణ వేలంలో దక్కించుకుందన్నారు. అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు కేటీఆర్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తోంది కేసీఆరేనని.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే ఇప్పుడు 40 వేల మందే ఉన్నారన్నారు.

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటంలో వారానికో కొత్త అంశంతో ఫైట్ లైవ్‌లో ఉండేలా చూసుకోవడంలో రెండు పార్టీలు సక్సెస్ అవుతున్నాయని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద్వేషం స్థాయికి వ్యతిరేకత – జగన్ చేసుకున్నదే!

ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో ...

పల్నాడులో దెబ్బకు దెబ్బ – వైసీపీ ఊహించనిదే !

పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు...

టాలీవుడ్‌… ఇక ఊపిరి పీల్చుకో!

ఈ వేస‌విలో చిత్ర‌సీమ ఎదుర్కొన్న గండాల్లో ఏపీ ఎన్నిక‌లు ఒక‌టి. ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత‌గా ఏపీ రాజ‌కీయాలు వేడెక్క‌డంతో... ప్ర‌జ‌ల దృష్టంతా అటువైపే ఉంది. కొత్త సినిమా క‌బుర్ల‌ని చెప్పుకోవ‌డానీ, థియేట‌ర్ల వ‌ర‌కూ...

తిట్లు,విధ్వంసం, రౌడీయిజానికా పాజిటివ్ ఓటు సజ్జలా !?

పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close