మోడీ నోటి వెంట వందేళ్ల అధికారం మాట !

కాంగ్రెస్‌కు అహంకారం ఇంకా తగ్గలేదని మరో వందేళ్లు అధికారంలోకి రాలేరని.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ సమాధానం ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్‌ను ఆయన చాలా ఘాటుగా టార్గెట్ చేశారు. కరోనా సంక్షోభంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించిందని .. కానీ దేశంలో విపక్షాలు మాత్రం సర్కార్‌ను నిందించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్న రాష్ట్రాల గురించి చెబుతూ ఇన్ని ఎన్నికల్లో ఓటమిపాలైనా కూడా ఇప్పటికీ కాంగ్రెస్‌కు అహంకారం తగ్గలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మీరు క్రెడిట్ తీసుకుందామనుకున్నారు కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదని తెలంగాణ అంశాన్నీ ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ దేశంలో రెండు ఇండియాలంటూ చేసిన ప్రసంగంపై మోడీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను విమర్శిస్తున్నారు. వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పేదలు కూడా లక్షాధికారుల వర్గంలోకి వచ్చారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.పేదల ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. టాయిలెట్ ఉందన్నారు. కాంగ్రెస్ విమర్శలకు వప్రతి విమర్శలతో మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close