ఖిలాడీ ట్రైల‌ర్‌: ఈ ఆట‌లో ఒక్క‌డే కింగ్‌

ర‌వితేజ అంటేనే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. దానికి కాస్త యాక్ష‌న్‌, ఇంకాస్త స‌స్పెన్స్ జోడిస్తే ఇక ఆ ఫార్ములాకి తిరుగులేదు. ఖిలాడి కూడా ఇదే ఫార్ములాలో రూపుదిద్దుకుంద‌నిపిస్తోంది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఇది. ఈనెల 11న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.

ఎప్ప‌డూ ఒకే టీమ్ కి ఆడ‌డానికి నేను నేష‌న‌ల్ ప్లేయ‌ర్‌ని కాదు..
ఐపీఎల్ ప్లేయ‌ర్‌ని… ఎవ‌డు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడ‌తా.. అనే ర‌వితేజ మార్క్ డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది.

వంద‌ల కోట్ల రూపాయ‌ల డ‌బ్బుకి చుట్టూ ఖిలాడీ క‌థ తిరుగుతుంది. అస‌లు ఆ డ‌బ్బు ఎవ‌రిది..? ఎవ‌రి చేతికి చిక్కింది? ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌ది స్టోరీ. అర్జున్ ఓకీల‌క పాత్ర‌లో క‌నిపించారు. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్ప‌టిలా అదిరిపోయింది.

మోహ‌న్ గాంధీ పేరుతో ర‌వితేజ పాత్ర‌ని ప్ర‌వేశ పెట్టారు. అయితే.. `గాంధీ పేరు పెట్టుక‌న్న బిన్ లాడెన్` అంటూ ఆ పాత్ర వేసే వేషాలు, చిందులూ చూపించారు. పాపేమో క‌స‌క్కూ.. నేనేమో ఫ‌స‌క్కూ… అంటూ ఇద్ద‌రు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల‌ని చూస్తే… గ్లామ‌ర్ డోసు బాగానే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దానికి తోడు.. లిప్ లాక్కు ఒక‌టి. అన‌సూయ‌, రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌.. ఇలా ప్యాడింగ్ బ్ర‌హ్మాండంగా కుదిరింది. ఓ కంటేన‌ర్‌, దాని నిండా బోలెడంత డ‌బ్బు, ఆ డ‌బ్బు కోసం ప‌రుగులు.. ఇదంతా స్క్రీన్ పై క‌నిపిస్తున్నాయి. డబ్బు కోసం ఏదైనా చేసే పాత్ర‌లా… హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ని తీర్చిదిద్దారు. విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌.. రిచ్ నెస్‌ని పెంచాయి. `పేకాట‌లో న‌లుగురు కింగ్స్ ఉంటారు. ఈ ఆట‌లో నేనొక్క‌డినే కింగ్‌` అనే డైలాగ్ తో ట్రైల‌ర్ పూర్త‌య్యింది. ర‌వితేజ నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటారో, అలాంటి సినిమానే ర‌మేష్‌వ‌ర్మ అందించాడ‌నిపిస్తోంది. క్రాక్ తో పుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసిన ర‌వితేజ కి మ‌రో హిట్టు ప‌డే అవ‌కాశాలైతే పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈనెల 11 వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.