ఉగాదికి పేర్ని, కొడాలి లకు జగన్ షాక్ ఖాయమట!

ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాదికి పూర్తి చేయాలని జగన్ డిసైడయినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ స్పష్టతకు వచ్చాయి. ఈ సందర్భంగా అత్యంత విధేయులకూ మినహాయింపు లేదన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. మంత్రి వ‌ర్గంలో పేర్ని నాని, కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు వంటి వారు జ‌గ‌న్ పై ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌లకు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తీరు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మంత్రి వ‌ర్గం నుండి తీసేసినా,ఎమ్మెల్యేగా ప‌ని చేయ‌క‌పోయినా,జ‌గ‌న్ కారు డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తానంటూ కొడాలి విధేయత చూపారు. అయితే ఆయన వల్ల అసలు పార్టీకి నష్టం జరుగుతోందన్న అభిప్రాయం జగన్‌లో కూడా ఏర్పడిందని చెబుతున్నారు. అయితే కొడాలి నానికి విధేయతతో పాటు ఎన్నో మైనస్‌లు ఉన్నాయి. కొడాలి నాని గుడివాడ కేసినోవా వ్య‌వ‌హ‌రం, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా పై హ‌త్యా య‌త్నం ఎపిసోడ్ లో గన్‌మెన్లు ఇప్పించి మరీ తిరస్కరించేలా చేయడం జగన్‌ను ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.

ఇక వెల్లంపల్లి ఎప్పుడూ వివాదాస్పద వ్యవహారాల్లోనే బయటకు వస్తున్నారు. అందరితో పాటు పేర్ని నానికి కూడా షాకివ్వడం ఖాయమంటున్నారు. వీరందర్నీ పార్టీ పనులకు ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. సీఎం జగన్‌కు ఏదీ నాన్చడం ఇష్టం ఉండదు. ఫటాఫట్ చేసేస్తారు. ఈ క్రమంలో వంద శాతం మంత్రులను మార్చడం ఖాయమని అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఉగాది కల్లా ప్రక్రియ పూర్తి చేస్తారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close