షర్మిల పాదయాత్రను పట్టించుకునేవారేరీ !?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. గతంలో పాదయాత్రకు బ్రేక్ పడిన చోట నుంచే తిరిగి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాక గ్రామం నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. అయితే ఆమె మళ్లీ పాదయాత్రను ప్రారంభించినట్లుగా ప్రచారం లభించలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదని.. పలు టీవీచానళ్లకు ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిది.

తెలంగాణలో షర్మిలకు మీడియా సపోర్టు కరవైంది. ఏబీఎన్ చానల్ గతంలో మంచికవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నట్లుగా మారిపోయింది. వైఎస్ఆర్‌టీపకి సోషల్ మీడియా కవరేజీ కూడా తక్కువ. ఖర్చు ఎక్కువ ఉందికానీ.., వస్తున్న ప్రచారం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఆమె పాదయాత్రలో పాల్గొంటున్న వారు కూడా.. స్థానికులు కాదని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారన్న విమర్శలు ఉన్నాయి. అంతా ఫ్యాబ్రికేటెడ్‌గా జరుగుతూండటంతో మీడియా కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల సైతం 2021 అక్టోబర్ 20వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టారు. 21 రోజుల పాటు పాదయాత్ర కొన‌సాగింది. మ‌ధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా ఉధృతి దృష్ట్యా 2021 నవంబరు 9వ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు ప్రారంభించేసరికి అసలు పట్టించుకునేవారు కరవయ్యారు. అదే సమయంలో ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త అనిల్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది మరింతగా మైనస్ అవుతోంది. తెలంగాణ ప్రజలు ఒక్క శాతం కూడా ఆమెను తెలంగాణ బిడ్డగా భావించకపోతూండటంతో పరిస్థితి పూర్తి మైనస్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close