రఘురామను అరెస్ట్ చేయకుండా పరువు నష్టం కేసు వేస్తున్నారట !

గత మూడేళ్ల నుంచి ఏపీ ప్రభుత్వం.. అక్కడి పోలీసుల వర్కింగ్ స్టైల్ వేరు. ఎవరిపైనైనా ఫిర్యాదు వచ్చినట్లుగా కూడా తెలియదు.. ఎఫ్ఐఆర్ నమోదయింది లేనిది కూడా తెలియదు.. ఎవరినైనా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవడమే. అది ఎంపీ అయినా .. సామాన్యుడయినా పెద్ద తేడా లేదు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అయితే అటూ ఇటూ చూసే పనికూడా లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. అయితే ఇప్పుడు ఎందుకోని రఘురామ విషయంలో పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రజాస్వామ్య మాటలు చెబుతున్నారు.

లిక్కర్ బ్రాండ్ల విషయంలో రఘురామ కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ ఆరోపించి ఆయనపై పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రకటించారు. గతంలో రఘురామ హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ లో ఏపీ మద్యం టెస్టులు చేయించి ఆ రిపోర్టుల్ని మీడియాకు ఇచ్చారు. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆ రిపోర్టుల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఆ ల్యాబ్ నుంచే ఓ లేఖ తీసుకొచ్చింది. పరీక్షించిన శాంపిల్స్ ఏపీ నుంచి తెచ్చినవనేదానికి ఆధారాలు లేవని.. ఎక్సైజ్ చట్టం ప్రకారం టెస్టులు చేయలేదని.. రఘురామ అడగకపోవడంతో ప్రమాణాల ప్రకారం టెస్టులు చేయలేదని ల్యాబ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఆ లేఖను రజత్ భార్గవ మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో హైడ్రాక్సైడ్ ఉండటమే ప్రమాదకరం కాదని, కొన్ని హైరెసల్యూషన్ పరీక్షల్లో మంచి నీళ్లు కూడా తాగటానికి హానికరం అని వస్తాయని రజత్ భార్గవ చెప్పుకొచ్చారు. రఘురామ కూడా అదే చెప్పారు.

రఘురామ శాంపిల్స్ ను మరోసారి చెన్నై ల్యాబ్‌కు పంపించారు. ఈ పరిస్థితుల్లో కంగారు పడిన ప్రభుత్వం.. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరికలు చేస్తోంది. రఘురామకృష్ణరాజు గతంలో ఈ నివేదిక విడుదల చేసినప్పుడే ఏపీబీసీఎల్ నోటీసులు పంపింది. ఇప్పుడు పరువునష్టం దావాకు సిద్ధమయింది. ఏదో ఓ ద్రోహం కేసులు పెట్టి రాత్రికిరాత్రి అరెస్ట్ చేయకుండా ఇలా పరువు నష్టం కేసులు వేయడం ఏమిటన్న చర్చ ఇప్పుడు రఘురామ వర్గీయుల్లో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close