ప్ర‌భాస్ కోసం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’

రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఎక్క‌డ చూసినా – ‘ఆర్‌.ఆర్‌. ఆర్‌’ మాట‌లే. అద్భుత‌మ‌నో, రాజ‌మౌళి మార్క్‌కి త‌గిన‌ట్టుగా లేద‌నో, మ‌రో గొప్ప సినిమా అనో.. ఎవ‌రికి తోచిన‌ట్టు, ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ల‌యితే… రాజ‌మౌళి ప్ర‌తిభ‌కు జోహార్లు చెప్పేస్తున్నారు. సుకుమార్ `ఇలాంటి సినిమా మీరు తీయ‌గ‌ల‌రు..మేం చూడ‌గ‌లం అంతే` అంటూ రాజ‌మౌళికీ, మిగిలిన ద‌ర్శ‌కుల‌కు ఉన్న తేడా స్ప‌ష్టంగా చెప్పేశాడు. మిగిలిన వాళ్లంతా త‌మ త‌మ శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. అయితే ప్ర‌భాస్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌` గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ మాట్లాడ‌లేదు. రాజ‌మౌళితో ప్ర‌భాస్ కి ఉన్న అనుబంధం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. `రాజ‌మౌళి వ‌ల్లే నేను పాన్ ఇండియా హీరో అయ్యా` అని ప్ర‌భాస్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. `రాధేశ్యామ్‌` ప్ర‌మోష‌న్ల‌కూ రాజ‌మౌళి సాయం ప‌ట్టాడు. అందుకే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` గురించి ప్ర‌భాస్ ఏం మాట్లాడ‌తాడా? అని అంతా వెయిటింగ్‌.

నిజానికి ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమానే చూడ‌లేద‌ట‌. అందుకే ప్ర‌భాస్ కోసం ప్ర‌త్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాల‌ని రాజ‌మౌళి టీమ్ భావిస్తోంది. ఈ సోమ‌వారం ప్ర‌భాస్ కోసం ప్ర‌త్యేకంగా ఈ సినిమా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్ కి ప్ర‌భాస్‌తో పాటుగా, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌లు కూడా వ‌స్తార‌ని స‌మాచారం. అయితే అదెప్పుడు? ఎక్క‌డ‌? ఇంకెవ‌రు పాల్గొంటారు? అనే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close