చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ – అంతా రాహుల్ పుణ్యమే !

బీజేపీనే ప్రత్యర్థి అన్నట్లుగా టీఆర్ఎస్ తలపడుతోంది. అయితే మంగళవారం మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. దీనికి కారణం రాహుల్ గాంధీ తెలుగులో చేసిన ట్వీట్. రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు అనుకూలంగా మద్దతునిస్తూ ట్వీట్ చేశారు. అదీ తెలుగులో. తెలంగాణలో పంట కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీలు బాధ్యత విస్మరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. ‘‘వరి పంట కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’’ అంటూ రాహుల్ తెలుగులో ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్ ఇలా పడిందో లేదో అలా వెంటనే టీఆర్ఎస్ కౌంటర్లు ప్రారంభించింది. రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేయడం కాదని, పార్లమెంటులో తమకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండని సవాల్ చేశారు. ఆమెకు తోడుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి.. జీవన్ రెడ్డితో పాటు ఇతర నేతలు తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అంటూ విమర్శలుచేశారు. హరీష్ రావు కూడా రాహుల్ గాంధీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

వీరికి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. “FCIకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అంటూ రేవంత్ రెడ్డి కవితకు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడడం లేదని, సెంట్రల్ హాల్లో బాగా కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం అంశంలో రాజీనామాలు చేద్దాం రావాలని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.ధాన్యం విషయంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ అనంతర పరిణామాలతో బీజేపీ పక్కకపోయింది. రోజంతా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఫైట్ నడిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close