హర్యానా – పంజాబ్ మధ్య రాజధాని చిచ్చు!

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న రచ్చను చూస్తూనే ఉన్నాం. అయితే ఏపీ పాలన గతంలోనే ఏపీకి వెళ్లిపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఓ పెద్ద పంచాయతీకి ముందుగానే తెరపడింది. కానీ పంజాబ్ – హర్యానా మధ్య ఇప్పుడు అలాంటి రాజధాని పంచాయతీ వచ్చేసింది. రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది.అదే చండిగఢ్. రెండు ప్రభుత్వాలూ అక్కడి నుంచే నడుస్తాయి. అందుకే ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు.

కేంద్ర పాలిత ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా కొన్ని కొత్త రూల్స్ తీసుకు వచ్చారు. ఇవి పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మన్ కు నచ్చలేదు. వెంటనే చండిఘడ్‌ను తమకు బదిలీ చేయాలని ఆయన తీర్మానం చేసేశారు. ఇక హర్యానా మాత్రం ఊరుకుంటుందా ? పైగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక వెంటనే రివర్స్ తీర్మానం చేశారు. . అంటే రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ప్రారంభమైనట్లేనని అనుకోవాలి.

ఇక్కడ బీజేపీ రాజకీయం చాలా చురుగ్గా ఉందని అనుకోవాలి ఎందుకంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ .. హర్యానాకు చెందిన వ్యక్తి. ఈ అంశాన్ని చండిఘడ్ విషయంలో ఆ పార్టీ తీరును ఇటు హర్యానాలో సెంటిమెంట్ గా మార్చి.. అక్కడ కూడా బలపడకుండా చేయడం.. అదే సమయంలో పంజాబ్‌లో హర్యానా వ్యక్తి నేతృత్వంలోని పార్టీతో పంజాబ్ ప్రయోజనాలు కాపాడలేరన్న అభిప్రాయాన్ని కల్పించే లక్ష్యంగా ఈ రాజకీయం ప్రారంభమైనట్లు ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close