కేంద్రమంత్రులతో ఏపీ బీజేపీ మొక్కుబడి ప్రయత్నాలు !

అన్ని రాష్ట్రాల్లోనూ హడావుడి చేస్తున్న బీజేపీ నేతలు ఏపీలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. వారెందుకు రాజకీయ కార్యక్రమాలు చేపట్టరు అని జనం కూడా ఆలోచించరు. ఇటీవల సోము వీర్రాజు ఉత్తరాంధ్ర యాత్ర అని ప్రారంభించారు కానీ పట్టించుకున్నవారు లేరు. కేంద్రమంత్రులు ఎవరూ రాకపోవడం … జాతీయ స్థాయి నాయకులు అనేవారు ఏపీవైపు చూడకపోవడంతో ఏపీలో పార్టీకి అసలు ఎలాంటి ప్రచారమూ దక్కడం లేదు. ఉనికి కనిపించడం లేదు . వస్తే జీవీఎల్ లేకపోతే ఇంకెవరూ రాలేదు. జీవీఎల్ చెప్పే మాటలు విని విని ఏపీ ప్రజలకు విసుగొచ్చింది.

ఒకే క్యాసెట్‌ను పదే పదే రిపీట్ చేస్తూంటారు ఆయన. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి… ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్‌కు వచ్చిందేమో కానీ.. కేంద్ర మంత్రుల్ని ఏదైనా కార్యక్రమాలకు ఏపీకి పంపాలని నిర్ణయించుకుంది. అధికారిక కార్యక్రమం మీద వచ్చినా పార్టీ కార్యక్రమాలు సహజంగానే ఉంటాయి కాబట్టి ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ నెలలోనే పీయూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రధాన్, జైశంకర్ వంటి కేంద్రమంత్రులు ఒక్కో వారం ఒక్కొక్కరు ఏపీలో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారైంది.

వారు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో స్పష్టత లేదు కానీ.. కేంద్రమంత్రులు వస్తున్నారంటే కాస్త రాజకీయం ఉండటం సహజమే . దీన్ని ఎలా బీజేపీ వాడుకుటుందనేది కీలకం. వచ్చిన వారు ముఖ్యమంత్రితో సమావేశమైతే.. మొత్తానికే మోసం వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. ఏదైనా కొంచం మైలేజీకి చాన్స్ ఉంటుంది. కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయా అనేదే ఏపీ బీజేపీ నేతల ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close