రివ్యూ: బ్లడీ మేరీ (ఆహా ఒరిజిన‌ల్‌) 

ఆహా ఓటీటీ ఒరిజినల్ కంటెంట్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళుతుంది. మొన్ననే ‘భామాకలాపం’ సినిమా నేరుగా ఆహా లో వచ్చింది. ఇప్పుడు మరో చిన్న సినిమా ఆహా  వేదికగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అదే `బ్లడీ మేరీ`. హీరోయిన్ నివేదా పెతురాజ్ కీలక పాత్ర చేసింది. ట్రైలర్ లో ఇదో క్రైమ్ డ్రామా గా చూపించడం ఆసక్తిని పెంచింది. కార్తికేయ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని అందించి  చందూ ముండేటి ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఆస‌క్తి పెరిగింది.. అజయ్, బ్రహ్మజీ, రాజ్ కుమార్ కసి రెడ్డి , కిరీటి ఇలా ప్రామెసింగ్ నటులంతా బాగమైన ఈ సినిమా కథలోకి వెళితే..

 మేరీ (నివేదా పేతురాజ్)కి లెన్స్ లేకపోతే కళ్ళు కనిపించవు. బాషా ( కిరీటీ) పుట్టుమూగ. రాజు (రాజ్ కుమార్) కి చెవుడు. ఈ ముగ్గురు అనాథ‌లు. ఒకే చోట పెరుగుతుంటారు. మేరీ నర్స్ గా పని చేస్తుంటుంది. బాషాకి నటన అంటే ఇష్టం. ఆడిషన్స్ ఇస్తుంటాడు. రాజుకి ఫోటోగ్రఫీ ఇష్టం. మేరీ పని చేస్తున్న హాస్పిటల్ లో ఓ డాక్టర్ మేరీపై మనసు పారేసుకుంటాడు. మేరీని తన రూమ్ లోకి పిలిచి బలవంతం చేస్తుండగా డాక్టర్ ని నెట్టేస్తుంది మేరీ. డాక్టర్ తలకు గాయమై చ‌నిపోతాడు. అదే రోజు బాషా ఒక డైరెక్టర్ దగ్గరికి ఆడిషన్స్ కి వెళ్తాడు. అక్కడ ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని బలవంతం చేస్తాడు. ఆమె కూడా అచ్చు మేరీలానే డైరెక్టర్ ని తోసేసి చంపేస్తుంది. ఇది బాషా సీక్రెట్ గా చూసి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాజా కెమరా తీసుకొస్తాడు. ఆ కెమరాలో డైరెక్టర్ ని చంపిన అమ్మాయి వీడియో రికార్డ్ అయ్యింటుంది. ఈ వీడియో కోసం ఎస్ఐ ప్రభాకర్ ( అజయ్) ఈ ముగ్గురి వెంటపడతాడు. అసలు అజయ్ ఆ వీడియో కోసం ఎందుకు వీరి వెంట పడతాడు? ఈ ముగ్గురు అనాథ‌లు ఒకే చోట ఎందుకు పెరుగుతుంటారు ? ఎస్ఐ ప్రభాకర్ నుంచి ఎలా తప్పించుకున్నారు ? అనేది మిగతా కథ.

కొన్ని కథలు చెప్పుకోవడానికి బావుంటాయి. కొన్ని కథలు చూడటానికి బావుంటాయి. కథగా చెప్పుకుంటే బ్లడీ మేరీ కథ మంచి పాయింటే అనిపిస్తుంది. కానీ చూస్తున్నపుడు మాత్రం.. ఏదో అలా సోసోగా సాగిపోతుంది తప్పితే.. కథలోకి ప్రేక్షకుడిని ఇన్వాల్ చేయలేకపోయింది. క్రైమ్ థ్రిల్లర్ లో కథని నడపాలని మొత్తం సెటప్ చేసిన దర్శకుడు.. అనాథ‌లు, అంగవైకల్యం, మహిళా శక్తీ ఇలా బోలెడు అంశాలు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.  హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూలో కథని నడిపాడు దర్శకుడు. ఆమెను చాలా ఇంటిల్‌జెంట్ గా చూపించాడు. సమస్య వచ్చిన ప్రతిసారి మేరీ దగ్గర ఒక ఉపాయం వుంటుంది. ఆమె తెలివితేటలతో నెగ్గుకొస్తుంది. అంటే .. మామూలుగా అయితే హీరో పాత్రకి ఇలాంటి తెలివితేటలు వుంటాయి. ఇక్కడ హీరోయిన్ కి వుండటం వెరైటీ అని భావించి వుంటారు.

వరుసగా రెండు హత్యలు జరిగిన తర్వాత ఎస్ఐ నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంటుదో అనే ఆసక్తి పెరగాలి. కానీ ఇక్కడ సెటప్ చేసిన కెమరా డ్రామా మరీ చిన్నపిల్లల ఆటలా అనిపించింది. ఇక చివర్లో ఇచ్చిన ముగింపు కాస్త గంద‌రగోళంగానే వుంటుంది. అప్పటివరకూ కథకి సంబంధం లేని కోణం వచ్చిపడుతుంది. నిజానికి దర్శకుడు ఈ కోణం నుంచే నిర్మాతకి కథని చెప్పివుంటాడు. ‘ఒక అనాధ. కళ్ళు కనిపించవు. కానీ తన తెలివితేటలతో ఒక పెద్ద సామ్రాజ్యం స్థాపిస్తుంది. ఆమెని చూడాలంటే హెలీక్యాప్టర్ లో వెళ్ళాలి” ఇలా చెబితే ఎవరైనా భలే వుందే అంటారు. కానీ ఇక్కడ చెప్పినట్లు సినిమా వుండదు. 

కథ మొత్తం జరిగిపోయాక ఎనిమిదేళ్ళు తర్వాత అని వేసి ఈ సామ్రాజ్యం సీన్ చూపిస్తారు. పైగా రైస్ అఫ్ బ్లడీ మేరీ అని పార్ట్ ఆలోచన కూడా వుంది ఫిల్మ్ మేకర్స్ కి. ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత ‘ఐ కేర్ ఏ లాట్’ అనే హాలీవుడ్ సినిమా రిఫరెన్స్ గుర్తుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక మహిళా తన తెలివితేటలతో ఎలా ఒక సామ్రాజ్యం స్థాపించిందో చూపించాలని బహుశా దర్శకుడు భావించి వుంటాడు . అయితే ఈ కథకు ఇది అనవసరం.

నివేదా పాత్రని  సూపర్ హీరో పాత్రలా డిజైన్ చేశారు. ఆమె కూడా చక్కగా చేసింది. ఫుల్ లెంత్ రోల్ ఆమెదే. అయితే చివర్లో వచ్చిన సీన్ ఆమె ఇమేజ్ కి సరిపోలేదు. ఇద్దరు స్నేహితులుగా కనిపించిన రాజ్ కుమార్, కిరీటీ తమ పాత్రలు చేసుకుంటూ వెళ్లారు. అయితే ఇలాంటి కథ చెప్పడానికి వారిని చెవిటి మూగ చేయాల్సిన అవసరం లేదు. అజయ్ కి ఇది పాత్ర పాత్రే. బ్రహ్మాజీ పాత్ర సీరియస్ గా వుంటుంది. అయితే ఆయన సీరియస్ గా ఉండటమే నవ్వుతెప్పిస్తాది. మిగతానటులు పరిధిమేర చేశారు.

సినిమాని చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తీశారు. చివర్లో ఆ హెలీ క్యాప్టర్ సీన్ ట్రైలర్ లో వేయడానికి పనికొస్తుంది. పాటలకు ప్రాధాన్యత లేదు. నేపధ్య సంగీతం ఓకే. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో...

ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా ...

ఏపీలో మోడీ బహిరంగసభ లేనట్లే !

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు...

లక్ష మెజార్టీ రాలే.. లక్ష ఓట్లొచ్చాయ్ !

ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో... పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close