జీవిత‌పై నాన్ బెయిల‌బ్ వారెంట్‌

న‌టి, నిర్మాత, ద‌ర్శ‌కురాలు జీవిత‌పై న‌గ‌రి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఓకే ఆస్తిని ఇద్ద‌రికి విక్ర‌యించార‌న్న కేసులో జీవిత‌పై ఈ వారెంట్ జారీ అయ్యింది. జీవిత‌కు చెందిన ఓ ఇంటిని జ్యోస్ట‌ర్ కంపెనికి ఎండీ హేమ‌కు రూ.26 కోట్ల‌కు అమ్మేశార‌ని, అయితే ఆ ఆస్తిని ఇది వ‌ర‌కే మ‌రొక‌రికి విక్ర‌యించార‌న్న‌ది ఆరోప‌ణ‌. ఈ విష‌య‌మై జీవిత‌ని అడిగితే.. ఆమె కొన్ని చెక్కులు హేమ‌కు అందించార్ట‌. అవ‌న్నీ బౌన్స్ అయ్యాయ‌ని స‌మాచారం. అందుకే హేమ కోర్టుకెళ్లారు. ఈ కేసులోనే జీవిత‌పై నాన్ బెయిల‌బ్ వారెంట్ జారీ చేశారు. అయితే.. ఈ నేప‌థ్యంలో జీవిత శ‌నివారం హైద‌రాబాద్ లో ఓ కీల‌క‌మైన ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌బోతున్నారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ప్రెస్ మీట్ లో స‌మాధానం చెబుతాన‌ని, త‌న ద‌గ్గ‌ర అన్ని ఆధారాలూ ఉన్నాయ‌ని జీవిత అంటున్నారు. మ‌రి ఆ ఆధారాలేమిటన్న‌ది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close