కవిత ఇంటి ముందు ధాన్యం – అర్వింద్ ఇంటి ముందు పసుపు !

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ వర్సెస్ మాజీ ఎంపీ కవిత రాజకీయ పోరాటం పీక్స్‌కు చేరిపోయింది. కవిత మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారేమో కానీ ఇంత కాలం ఎంపీ అర్వింద్‌ను పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం ఆమె దూకుడు మీద ఉన్నారు. పసుపు బోర్డు దగ్గర్నుంచి ప్రతి వైఫల్యంపైనా దృష్టి పెడుతున్నారు. కవిత రాజకీయ దాడుల్ని అర్వింద్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతి విమర్శలు గుట్టిగానే చేస్తున్నారు.

వీరిద్దరి పోరాటంలోకి కొత్తగా రైతులు వచ్చారు. రైతుల కేంద్రంగానే వీరి సవాళ్లు.. ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చినందున అర్వింద్ రాజీనామా చేయాలని… పసుపు రైతుల పేరుతో టీఆర్ఎస్ నేతలు అర్వింద్ ఇంటి ముందు పసుపు పోసి నిరసనలు ప్రారంభించారు. అర్వింద్ అనుచరులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ధాన్యం రాశుల్ని తెచ్చి కవిత ఇంటి ముందు పోసి.. ధాన్యం కొనుగోళ్లపై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒకరి ఇళ్ల ముందు ఒకరు పసుపు, ధాన్యాల్ని పారబోసి ధర్నాలు చేయిస్తున్నారు.

తెలంగాణలో మరే నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి లేదు. నిజామాబాద్‌లో తన పరపతిని పెంచుకోవాలనుంటున్న కవిత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కానీ ఎలాగైనా తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్వింద్ మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ పోరాటం రసవత్తరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close