‘అర్జునుడు’గా మ‌హేష్‌?

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఈ సినిమా టైటిల్ ఏమిటి? ఏ జోన‌ర్‌లో సాగుతుంది? అనే విష‌యాల్లో చాలా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. చాలా కాలంగా ఈ క‌థ‌పైనే త్రివిక్ర‌మ్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ స్క్రిప్టు లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. `అర్జునుడు` అనే టైటిల్ ని ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. దాదాపుగా అదే లాక్ చేసే అవ‌కాశం ఉంది. త్రివిక్ర‌మ్‌కి `అ` సెంటిమెంట్ ఎక్కువ‌. `అత‌డు`లో మ‌హేష్ పేరు `పార్థు`. ఈ సినిమాకి ఆ పేరే ఫిక్స్ చేస్తార‌ని అనుకున్నారంతా. అర్జునుడికి మ‌రో పేరు పార్థు. సో… త్రివిక్ర‌మ్ ఈ పేరు ఫిక్స్ చేయ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం కావొచ్చు. మే 31 కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close