ఎన్టీఆర్ – క‌మ‌ల్ హాస‌న్‌.. ప్ర‌శాంత్ నీల్‌?

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొర‌టాల శివ‌తో సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమానే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తార‌ని స‌మాచారం అందుతోంది. కేజీఎఫ్ 2లో స్టార్ల‌తో నింపేశాడు ప్ర‌శాంత్ నీల్. అయితే ప్ర‌తీ పాత్ర‌కూ ఓ ప్రాధాన్యం క‌నిపించింది. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంలో ప్ర‌శాంత్ నీల్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ క‌థ‌కు కూడా ఓ బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు కావాల‌ని ప్ర‌శాంత్ భావిస్తున్నాడు. అందుకే క‌మ‌ల్ ని అప్రోచ్ అయిన‌ట్టు తెలుస్తోంది. క‌మ‌ల్ కి ముందు నుంచీ వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌య‌త్నాలూ, పాత్ర‌లూ అంటే చాలా ఇష్టం. పాత్ర న‌చ్చితే విల‌నా? హీరోనా? అనేది కూడా చూడ‌డు. దానికి తోడు ఎన్టీఆర్ లాంటి ఈత‌రం హీరోల‌తో ప‌ని చేయ‌డానికి క‌మ‌ల్ ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ కి ఉన్న క్రేజ్ కూడా త‌న‌కు తెలుసు. కాబ‌ట్టి.. ఈ సినిమా ఒప్పుకోవ‌డంలో క‌మ‌ల్ కి ఎలాంటి అభ్యంత‌రాలూ ఉండ‌క‌పోవొచ్చు. ప్ర‌స్తుతం ఈ ఆలోచ‌న‌.. ప్రాధ‌మిక ద‌శ‌లోనే ఉంది. క‌మ‌ల్ గ‌నుక‌.. ఓకే అయి, ఈ ప్రాజెక్టులోకి వ‌స్తే.. ఇక ఈ కాంబినేష‌న్‌కి తిరుగుండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close