ప‌వ‌న్ సినిమా.. తేజ్‌పైనే దృష్టి

స‌ముద్ర‌ఖ‌ని త‌మిళ చిత్రం `వినోద‌య సీత‌మ్‌` ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడు. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌బోతున్నాడు. స్క్రిప్టు ప‌నులు మొద‌ల‌య్యాయి. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

మాతృక‌లో స‌ముద్ర‌ఖ‌ని పోషించిన పాత్ర ప‌వ‌న్ చేస్తున్నాడు. తంబి రామ‌య్య క్యారెక్ట‌ర్ సాయిధ‌ర‌మ్ కి ద‌క్కింది. ఓ సూప‌ర్ హిట్ క‌థ‌ని రీమేక్ చేస్తున్నప్పుడు మార్పులూ, చేర్పులూ త‌థ్యం. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్ కి త‌గ్గ‌ట్టుగా ఆ మార్పులు ఉంటాయ‌ని ఆశిస్తారు. కానీ ఈ సారి సీన్ రివ‌ర్స్ అవుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే, సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌పై ఎక్కువ దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. మాతృక‌లో తంబి రామ‌య్య పోషించిన పాత్ర తేజ్‌కి ద‌క్కింది. ఇద్ద‌రికీ వ‌య‌సు రీత్యా చాలా తేడా ఉంది. త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు పెళ్లి చేయ‌డానికి స‌త‌మ‌త‌మ‌య్యే మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రిగా తంబి రామ‌య్య న‌టించారు. ఇక్కడ తేజ్ వ‌చ్చాడు కాబ‌ట్టి.. కూతుర్ల‌కు బ‌దులుగా చెల్లాయిల్ని తీసుకొచ్చారు. తేజ్ కోసం ఓ ల‌వ్ ట్రాక్ కూడా ఉంది. దాంతో.. ఈ క‌థ‌లో యూత్ కి క‌నెక్ట్ అయ్యే పాయింట్స్ పుట్టుకొచ్చాయ‌ట‌. మార్పులు, చేర్పుల వ‌ల్ల‌.. సాయిధ‌ర‌మ్ పాత్ర‌కి ఇంకాస్త వెయిటేజ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. తేజ్ అంటే ప‌వ‌న్‌కి చాలా ఇష్టం. తేజ్ హీరో కావాలి అనుకున్న‌ప్పుడు స‌పోర్ట్ చేసింది ప‌వ‌న్ క‌ల్యాణే. అందుకే… తెర‌పై వీరిద్ద‌రి కెమిస్ట్రీ బాగా పండుతుంద‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రావు ర‌మేష్‌ని కూడా అడ‌గాలా చిరూ…?

ఎంత‌కాద‌న్నా చిరంజీవి మెగాస్టార్‌. ఎవ‌రు అవున్నా.. కాద‌న్నా.. ఇండ‌స్ట్రీకి ఆయ‌నే పెద్ద దిక్కు. చిరుతో క‌లిసి న‌టించాల‌ని, ఆయ‌న‌తో ప‌ని చేయాల‌ని ఎవ్వ‌రైనా కోరుకోవ‌డం స‌హ‌జం. అలాంటిది చిరంజీవే.. 'మీతో క‌లిసి న‌టించాల‌ని...

చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం – వెళ్లక తప్పుతుందా ?

చిరంజీవి ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి...

జనసేనాని జనవాణి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాక ముందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. బాదితులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోతూండటమే కాదు.. అసలు అర్జీలు కూడా తీసుకోవడం...

మోహన్‌బాబు బీజేపీ మనిషట.. అయితే కోర్టులు సమన్లివ్వకూడదా ?

తాను బీజేపీ మనిషినని మోహన్ బాబు తిరుపతి కోర్టు ఎదుట బహిరంగంగా చెప్పుకున్నారు. ఆయన ఏ పార్టీ మనిషని ఏ మీడియా ప్రతినిధి అడగలేదు. కానీ ఆయనంతటకు ఆయనే చెప్పుకున్నారు. తాను బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close