ఎన్టీఆర్ – క‌మ‌ల్ హాస‌న్‌.. ప్ర‌శాంత్ నీల్‌?

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొర‌టాల శివ‌తో సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమానే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తార‌ని స‌మాచారం అందుతోంది. కేజీఎఫ్ 2లో స్టార్ల‌తో నింపేశాడు ప్ర‌శాంత్ నీల్. అయితే ప్ర‌తీ పాత్ర‌కూ ఓ ప్రాధాన్యం క‌నిపించింది. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంలో ప్ర‌శాంత్ నీల్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ క‌థ‌కు కూడా ఓ బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు కావాల‌ని ప్ర‌శాంత్ భావిస్తున్నాడు. అందుకే క‌మ‌ల్ ని అప్రోచ్ అయిన‌ట్టు తెలుస్తోంది. క‌మ‌ల్ కి ముందు నుంచీ వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌య‌త్నాలూ, పాత్ర‌లూ అంటే చాలా ఇష్టం. పాత్ర న‌చ్చితే విల‌నా? హీరోనా? అనేది కూడా చూడ‌డు. దానికి తోడు ఎన్టీఆర్ లాంటి ఈత‌రం హీరోల‌తో ప‌ని చేయ‌డానికి క‌మ‌ల్ ఉత్సాహం చూపిస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ కి ఉన్న క్రేజ్ కూడా త‌న‌కు తెలుసు. కాబ‌ట్టి.. ఈ సినిమా ఒప్పుకోవ‌డంలో క‌మ‌ల్ కి ఎలాంటి అభ్యంత‌రాలూ ఉండ‌క‌పోవొచ్చు. ప్ర‌స్తుతం ఈ ఆలోచ‌న‌.. ప్రాధ‌మిక ద‌శ‌లోనే ఉంది. క‌మ‌ల్ గ‌నుక‌.. ఓకే అయి, ఈ ప్రాజెక్టులోకి వ‌స్తే.. ఇక ఈ కాంబినేష‌న్‌కి తిరుగుండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పట్లో పెట్టుబడుల వరద – ఇప్పుడు సొంత వాళ్లే జంప్ ! చిత్తూరు జిల్లాకు ఇదేం ఖర్మ !

అమరరాజా సంస్థ తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తోందని బిజినెస్ వర్గాల్లో కొంత కాలం కిందట ప్రచారం జరిగింది.. అప్పుడు ఘనత వహించిన డీఫ్యక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ముఖ్యంగా...

సమైక్య రాష్ట్రం చేసేందుకు మళ్లీ చంద్రబాబు కుట్రట !

టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్లీ .. సమైక్య వాదుల కుట్రనడం ప్రారంభించేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏడాదిగా కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని.....

రివ్యూ : HIT – ది సెకండ్ కేస్

HIT2 Movie review తెలుగు360 రేటింగ్ 2.75/5 నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థలకి ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఆసక్తికరంగా చూపించాలే గానీ ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధమే. హీరో నాని నిర్మాతగా మారి ఈ...

అధికార పార్టీ ప్రాంతీయ గర్జనలు -వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఆశలు వదిలేసినట్లుగా.. రాయలసీమపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అక్కడి ప్రజల్లో సీమ సెంటిమెంట్ ఎంత రెచ్చగొడితే అంత మేర లాభమని అనుకుంటున్నారు. ఐదో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close