`ఎఫ్ 3`లో అనిల్ రావిపూడి వాటా?

హీరోలు పారితోషికాల‌తో పాటు, సినిమా లాభాల్లో వాటాలు అందుకుంటూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాట‌లో దర్శ‌కులూ ప‌య‌నిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ లో.. త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన వాటాదారుడు. రాజ‌మౌళి సంగ‌తి స‌రే స‌రి. ఆయ‌న‌కు పారితోషికాల‌తో ప‌నిలేదు. లాభాల్లో ఆయ‌న‌కంటూ వాటా ఉంటుంది. కొర‌టాల శివ కూడా అంతే. `ఆచార్య‌` సినిమాని దాదాపు ఆయ‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు… అనిల్ రావిపూడి కూడా అదే చేసిన‌ట్టు స‌మాచారం.

ఆయ‌న నుంచి ఇప్పుడు ఎఫ్ 3 వ‌స్తోంది. ఈనెల 27న విడుద‌ల కానుంది. ఎఫ్ 2 తో పోలిస్తే… ఈ సినిమాకి బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే.. అనిల్ రావిపూడి మాత్రం పారితోషికం తీసుకోలేద‌ట‌. లాభాల్లో వాటా కావాల‌ని అడిగార‌ట‌. అనిల్ రావిపూడి.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌కు ఫ్లాపంటూ లేదు. ఇలాంటి ద‌శ‌లో అనిల్ ఎంత అడిగితే అంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అంటారు. కానీ.. ఎఫ్ 3కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకున్న అనిల్.. పారితోషికం కంటే, వాటానే బెట‌ర్ అని భావించి ఉంటారు. అందుకే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎఫ్ 3 గ‌నుక హిట్ట‌యితే… ద‌ర్శ‌కుడిగా రావిపూడి జాక్ పాట్ కొట్టినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close